మారుతున్న జీవనశైలిలో భాగంగా ఒకేచోట కూర్చుని చేసే వృత్తుల కారణంగానైనా... లేదా మన జీవనశైలిలో ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిన ఆల్కహాల్ తీసుకోవడం వల్లనైనా ఇటీవల ఫ్యాటీలివర్ డిసీజ్ బాగా ఎక్కువగా కనిపిస్తోంది. ఇందులోనూ గ్రేడ్‌లో ఉంటాయి. మొదటి లేదా రెండో గ్రేడ్ వరకు కేవలం మంచి ఆరోగ్యకరమైన నడవడిక, మన జీవనశైలిలో భాగంగా ఆరోగ్యకరమైన అలవాట్లు, వ్యాయామంతో మొదటి, రెండో దశలోని ‘ఫ్యాటీ లివర్’ కండిషన్‌ను తేలిగ్గా అధిగమించవచ్చు. కానీ అంతకు మించి దాటితే మాత్రం కాలేయం పూర్తిగా కొవ్వుతో నిండిపోయి మొదటికే మోసం రావచ్చు. అప్పుడు కాలేయ మార్పిడి తప్ప మరో మార్గ ఉండకపోవచ్చు. అందుకే సకాలంలోనే గుర్తించి మొదటి లేదా రెండో దశలోనే ‘ఫ్యాటీ లివర్’ను నిలువరించాలి. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి, దానికి కారణాలేమిటి, దానితో వచ్చే అనర్థాలేమిటి వంటి అనేక అంశాపై అవగాహనను కలిగించేదే ఈ కథనం.
ఈ మధ్యకాలంలో మన జీవనశైలిలో నగరీకరణ /పట్టణీకరణ జరుగుతున్న కొద్దీ మనం తీసుకునే ఆహారంలో క్యాలరీ లు చాలా ఎక్కువగా ఉండటం, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారాలు పెరుగుతున్నాయి. దానికి తోడు శారీరక శ్రమ ఎంతమాత్రమూ లేని వృత్తులే అన్నిచోట్లా ఉన్నాయి. ఫలితంగా స్థూలకాయం, డయాబెటిస్తో పాటు ఫ్యాటీలివర్ అనే కండిషన్ చాలామందిలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది.
ఫ్యాటీ లివర్ అంటే...
మన పొట్టలో కుడిపైపున కాలేయం ఉంటుంది. మనం తీసుకుంటున్న ఆహారంలో క్యాలరీలు, చక్కెరలు పెరుగుతున్న కొద్దీ శరీర శ్రమకు వినియోగమైనవి పోగా... మిగతావన్నీ కాలేయంలో కొవ్వు రూపంలో నిల్వ అవుతాయి. దాంతో క్రమంగా కాలేయం కణాలు తమ సహజ గుణాన్నికోల్పోయి కొవ్వు పేరుకున్నట్లుగా అయిపోతుంటాయి. ఇలాంటి కండిషన్‌నే ఫ్యాటీలివర్ అంటారు.
ఫ్యాటీలివర్... దశలు...
ఫ్యాటీలివర్‌లో మూడు దశలు ఉంటాయి.
కారణాలివి...
ఫ్యాటీలివర్‌లో మన ప్రమేయంతో నివారించుకోగలిగే కారణాలతో పాటు మనం నివారించలేని కారణాలూ ఉంటాయి.
నివారించగల కారణాలు
ఉదాహరణకు మద్యం అలవాటు ఉన్నవారిలో ఫ్యాటీ లివర్ కండిషన్ ఎక్కువ. మద్యం అలవాటును మానుకోవడం అన్నది మనం నివారించుకోగలిగే అంశం. అలాగే బరువు తగ్గించుకోవడం కూడా కొంతవరకు మన చేతుల్లో ఉన్నదే. ఇక మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ (పిండిపదార్థాలు) తీసుకోవడం కూడా మనం నివారించుకోగలిగే అంశమే.
నివారించుకోలేని కారణాలు
మంచి జీవనశైలి మార్గాలతో వాటిని కొంతవరకు మాత్రమే నివారించగలిగినప్పటికీ డయాబెటిస్, నివారించుకోలేనంత బరువు పెరగడం అన్నవి మనం ప్రయత్నపూర్వకంగా నివారించలేని కారణాలు. శరీరం బరువు పెరుగుతున్న కొద్దీ కాలేయానికి నష్టం వాటిల్లుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. స్థూలకాయం ఉన్న 90 శాతం మందిలో మొదటి దశ ఫ్యాటీలివర్ కనిపించడం చాలా సాధారణ అంశం. అలాగే స్థూలకాయం ఉన్న 20 శాతం వ్యక్తుల్లో మనం రెండో దశగా పేర్కొనే ఎన్‌ఏఎస్‌హెచ్ దశ ఉంటోంది. ఫ్యాటీ లివర్ వచ్చిన వ్యక్తుల్లో దాదాపు 50 శాతం మందిలో డయాబెటిస్ ఉంటుంది. ఇక సిర్రోసిస్ దశకు చేరినవారిలో 95% మంది డయాబెటిస్, స్థూలకాయం ఉన్నవారే.
ఫ్యాటీలివర్ వల్ల పరిణామాలు
∙ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చాక తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కాలేయం పూర్తిగా దెబ్బతినిపోయే సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు.
∙ఫ్యాటీ లివర్ దశల్లో మొదటిదశ నుంచి క్రమంగా రెండో దశ అయిన ఎన్ఏఎస్హెచ్కూ, అక్కడి నుంచే మూడో దశ అయిన సిర్రోసిస్‌కు దారి తీస్తుందని అనుకోడానికి లేదు. చాలా సందర్భాలలో పరిస్థితులు మొదటి దశ నుంచి నేరుగా మూడో దశ అయిన సిర్రోసిస్‌కు దారితీయవచ్చు. అందుకే ఫ్యాటీలివర్ కనిపించినప్పుడే జాగ్రత్తగా ఉండాలి.
ఫ్యాటీ లివర్ నివారణ మార్గాలు
ఫ్యాటీలివర్ డిసీజ్ లక్షణాలు
ఫ్యాటీలివర్ నిర్ధారణ పరీక్షలు
అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్‌తో చాలావరకు ఫ్యాటీలివర్ డిసీజ్ తెలుస్తుంది. దానితోపాటు లివర్ ఫంక్షన్ పరీక్ష చేయించాలి. దానితో ఏవైనా ఎంజైములు స్రవించడం వల్ల కాలేయం దెబ్బతిన్నదా అన్న సంగతీ తెలుస్తుంది. డయాబెటిస్, కొలెస్ట్రాల్ స్థాయులు, ట్రైగ్లిజరైడ్ పెరుగుదలనూ పరిశీలించే పరీక్షలు చేయించాలి. కొందరిలో లివర్ బయాప్సీ అవసరం.
ఫ్యాటీ లివర్ వ్యాధికి చికిత్స