World's Rarest Dog Breed: ఇది జిరాఫీ కాదు!! కుక్క.. అత్యంత అరుదైన బ్రీడ్‌!! కానీ కారు ప్రమాదంలో..

27 Nov, 2021 16:49 IST|Sakshi
అజ్వాక్ జాతికి చెందిన బ్రాడీ

అతిపెద్ద మెడ  జిరాఫీకి మాత్రమే ఉంటుందని అనుకుంటే పొరపాటే..! ఇంకెవరికుంటుందబ్బా.. అని ఆలోచిస్తున్నారా? పొడవాటి మెడ, శరీరంపై మచ్చలతో ఉన్న ఓ వింత కుక్కను జిరాఫీతో పోలుస్తున్నారందరు. దీని అందం వెనుక తీవ్ర విషాదం కూడా దాగి ఉంది. అసలేం జరిగిందంటే..

లూయిసా క్రూక్ అనే యువతి 2016లో కారు ప్రమాదంలో గాయపడిన బ్రాడీ అనే అజ్వాక్ జాతి కుక్కను రక్షించింది. అప్పుడు బ్రాడీ వయస్సు 6-7 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఐతే ఈ ప్రమాదంలో బ్రాడీ ఒక కాలు, చెయ్యి కోల్పోయింది. సాధారణంగా అజ్వాఖ్ జాతి కుక్కల మెడలు పొడవుగా ఉంటాయి. ఐతే కారు ప్రమాదం తర్వాత బ్రాడీ రూపం గణనీయంగా మారింది. 

లూయిసా మాటల్లో.. ‘బ్రాడీ నేను చూసిన అత్యంత అందమైన కుక్కపిల్ల. బ్రాడీని మొదటిసారి చూసినప్పుడు రక్తపు మడుగులో విపరీతమైన బాధతో కదలలేకపోయింది. బ్రాడీ మెడ చాలా పొడవుగా ఉండటం గమనించాను. కానీ దాని తెగిపోయిన భుజం, మెడతో ముడిపడి ఉన్నట్లు అనిపిస్తుంది. అది చాలా పొడవుగా ఉన్నట్లు కూడా కనిపించిందని తెల్పింది. ఐతే అన్ని అజ్వాక్ జాతి కుక్కలకు మచ్చలు ఉండవని లూయిసా పేర్కొంది. ఇది బ్రాడీ ప్రత్యేక లక్షణాల్లో ఒకటి. ప్రస్తుతం బ్రాడీ చాలా ఆరోగ్యంగా ఉందని, మా ఇద్దరికీ మంచి స్నేహం కుదిరిందని స్థానిక మీడియాకు తెలిపింది.

చదవండి: శీతాకాలంలో చలిని తట్టుకోవాలంటే ఇది ఎక్కువగా తినాలి..!

మరిన్ని వార్తలు