రోజూ పాలు తాగుతున్నారా..ఐతే ఆ వ్యాధి తప్పదు! షాకింగ్‌ విషయాలు వెల్లడించిన వైద్యులు

4 Sep, 2023 16:16 IST|Sakshi

పాలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. కాల్షియం ఉంటుంది ఎముకలకు బలం మన పెద్దవాళ్లు చెబుతుంటారు. చదివే పిల్లలు రోజు పాలు తాగడం మంచిదని మన బామ్మలు పాలు అవి ఇస్తుంటారు. కమ్మటి పాలు తాగితే హాయిగా నిద్ర కూడా వచ్చేస్తుంది. అలాంటి పాలను రోజు తాగొద్దంటూ ఆరోగ్య నిపుణులు. కాదని అలా తాగితే ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అందులోనూ పురుషులకైతే ఆ ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు. 

వైద్యులు ఏం చెబుతున్నారంటే..
కాల్షియం వంటి విటమిన్‌లను అందించే పాలు రోజు తాగితే..ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వార్నింగ్‌ ఇస్తున్నారు వైద్యులు. ఎముకలకు బలం అన్న ఆ పాలే మంచిది కాదని స్ట్రాంగ్‌గా చెప్పేస్తున్నారు యూకే ఆధారిత క్యాన్సర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ వైద్యులు. ఆ రీసెర్చ్‌ సెంటర్‌ వైద్య బృందం చేసిన పరిశోధనల్లో చాలా షాకింగ్‌ విషయాలు వెల్లండించారు. పాలల్లో ఉండే హార్మోన్లు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతాయి.

ఆ హార్మోన్లే క్యాన్సర్‌ కారకాలుగా..
యూకే క్యాన్సర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ తన పరిశోదన ఫలితాల్లో పాలు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌కు ఎలా కారకం అవుతుందో వెల్లడించారు. ఈస్ట్రోజన్‌, ఇన్సులిన్‌ వంటి హార్మోన్లు సహజంగా ఆవుపాల్లో ఉంటాయి. ఈ హర్మోన్లు పెరుగుదల హార్మోన్లు. అవే ఇప్పుడు క్యాన్సర్‌ వృద్ధికి కారణమవుతాయని అంటున్నారు. ప్రతి రోజు కాఫీతో పాలు తాగడం వల్ల ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువని చెబుతున్నారు. యూఎస్‌లోని లోమా లిండా విశ్వవిద్యాలయం మూడు దశాబ్దాలుగా 22 వేలమంది పురుషులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

రోజు 2.5 శాతం పాల ఉత్పత్తులకు సంబంధించిన వాటిని ఇవ్వగా ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం 34 శాతం ఎక్కువగా ఉందని నిర్థారించారు వైద్యులు. అధిక వెన్న శాతం ఉన్న పాల కంటే తక్కువ వెన్న శాతం ఉన్న నాన్‌ క్రీమ్‌ పాలతోనే ఈ ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని అధ్యయనంలో గుర్తించారు. అయితే ప్రత్యేకించి ఈ ఆహారం నుంచే ఈ ప్రమాదం ఎక్కువ అని కచ్చితంగా చెప్పడం కష్టమేనని అన్నారు. దీనిపై మరింత పరిశోనలు చేయాల్సి ఉందని కూడా చెప్పారు. దీనికి సరైన విధమైన జీవనశైలి పాటించని వారై, చెడ్డ ఆహారపు అలవాట్లు ఉన్నట్లయితే ఆ ప్రమాదం మరింత ఎక్కువ అని చెబుతున్నారు. 

(చదవండి: రక్తంలో ట్రైగ్జిజరైడ్స్‌ను తగ్గించుకోవాలంటే..ఇలా చేయండి!)
 

మరిన్ని వార్తలు