బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఇటో లుక్కేయండి

18 Feb, 2021 00:24 IST|Sakshi

మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ మీరు తినే ఆహారంలో 30 గ్రాముల పీచు ఉండేలా చూసుకుంటే చాలు. మీ బరువు పెరగరు సరికదా... పెరిగిన బరువూ తగ్గే అవకాశాలూ ఎక్కువే. కొన్నాళ్ల కిందట అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ (ఏహెచ్‌ఏ)సంస్థ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం తేలింది. వారు కొంతమంది ప్రీ–డయాబెటిక్‌ పేషెంట్లను తమ అధ్యయనం కోసం ఎంపిక చేశారు. 

టైప్‌–2 డయాబెటిస్‌ వచ్చేందుకు అవకాశం ఉన్న దాదాపు 300 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. తమ ఆహారంలో ఉప్పు, చక్కెర, ఆల్కహాల్‌లను చాలా చాలా పరిమితంగా మాత్రమే తీసుకుంటూ.... పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పండ్లు, పొట్టుతీయని ధాన్యాలతో వండిన వంటలతో పాటు కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు కూడా తగుమాత్రంగా తీసుకునే నియమాలు పాటించిన వారు కేవలం ఏడాది వ్యవధిలోనే 2.72 కిలోలు (ఆరు పౌండ్ల) బరువు తగ్గినట్లు గుర్తించారు. అందుకే ఆహారంలో పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటూ బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యమూ సమకూరుతుందని ఏహెచ్‌ఏ సంస్థ పేర్కొంది.

చదవండి: (గుండెపోటు లక్షణాలపై అవగాహనకు ఓ కథనం..) 

(సిగరెట్‌ సూసైడ్‌లను ప్రేరేపిస్తుందా?)

మరిన్ని వార్తలు