ఉడికించిన పచ్చి మామిడికాయ రసంలో ఉప్పు , జీలకర్ర కలిపి రోజూ తాగితే..

19 Apr, 2022 15:16 IST|Sakshi

వడదెబ్బ నివారణకు...

Summer Care- Useful Tips: ఎండలు ముదురుతున్నాయి. ఈ సమయంలో వడదెబ్బ తగిలితే కష్టం. దానికంటే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ చిట్కాలు పాటిస్తే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు.

వేసవి ఎండలో నడవవలసి వచ్చినపుడు ఒక ఉల్లిపాయను టోపీలో గాని రుమాలులో గాని నడినెత్తిన పెట్టి కట్టుకొని నడిస్తే వడదెబ్బ తగలదు.
వడడెబ్బ తగిలిందని అనుమానంగా ఉంటే ముఖం మీద, ఒంటిమీదా నీళ్లు చల్లుతూ తలపైన ఐస్‌క్యూబ్స్‌ ఉంచి నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగించడం వల్ల నష్ట నివారణ జరుగుతుంది. 
ఉడికించిన పచ్చి మామిడికాయ రసంలో ఉప్పు , జీలకర్ర కలిపి రోజూ తాగడం వల్ల వడదెబ్బ తగలదు.
తరువాణి తేటలో ఉప్పు కలిపి తాగుతుండాలి.
తాటిముంజలను పంచదారతో కలిపి తింటూ ఉంటే వడదెబ్బనుంచి తప్పించుకోవచ్చు. 
వేడి వేడి గంజిలో ఉప్పు వేసి తాగించడం, ఉల్లిపాయ రసాన్ని రెండు కణతలకు, గుండె మీద పూయడం వల్ల వడదెబ్బ తగలడం వలన కలిగిన బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.

చదవండి: Inti Panta: జానెడు జాగా ఖాళీగా ఉంచరు.. అక్కడ కూరగాయలన్నీ ఉచితమే!

మరిన్ని వార్తలు