Summer Care - Beauty Tips: ఈ ప్యాక్‌ వేసుకుంటే ముఖంపై పేరుకుపోయిన జిడ్డు, దుమ్మూధూళి మటుమాయం

22 Mar, 2022 11:01 IST|Sakshi

సమ్మర్‌ కేర్‌ 

క్రమంగా పెరుగుతోన్న ఉష్ణోగ్రతల నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే.. రోజుకి కనీసం మూడు లీటర్ల మంచినీటితోపాటు కొబ్బరి నీళ్లను తాగాలి. వీలైనంత ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవడంతోపాటు సులభంగా ఇంట్లో తయారు చేసిన ప్యాక్‌లు వేసుకోవడం ద్వారా వేసవిలో కూడా ముఖవర్ఛస్సుని కాపాడుకోవచ్చు.

కప్పు పెరుగులో టేబుల్‌ స్పూను తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదినిమిషాలపాటు ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ ముఖానికి సహజ సిద్ధమైన మాయిశ్చర్‌ను అందించి కాంతిమంతంగా కనిపించేలా చేస్తుంది. 

బాగా పండిన అరకప్పు బొప్పాయి గుజ్జులో రెండు టేబుల్‌ స్పూన్ల గంధం పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. తరువాత చల్లటి నీటితో కడిగేయాలి.

ఈ ప్యాక్‌ వేసుకోడం వల్ల ముఖంపై పేరుకుపోయిన జిడ్డు, దుమ్మూధూళి వదిలి, చర్మం కాంతివంతంగా కనిపించడమే కాదు, మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.  

చదవండి: Ragi Java Health Benefits: రాగిజావను పాలు, బెల్లం, యాలకుల పొడితో కలిపి కాచుకుని తాగే అలవాటు ఉందా.. అయితే

మరిన్ని వార్తలు