Carrot Apple Juice Health Benefits: రోజుకొక గ్లాసు ఈ జ్యూస్‌ తాగారంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

22 May, 2022 09:44 IST|Sakshi

క్యారట్‌ యాపిల్‌ జ్యూస్‌!

Summer Drinks- Carrot Apple Juice: తియ్యగా పుల్లగా ఎంతో రుచిగా ఉండే క్యారట్‌ యాపిల్‌ జ్యూస్‌ వేసవిలో తాగడానికి చాలా బావుంటుంది. దీనిలో ఫాలీఫీనాల్స్,  పొటాషియంలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు, ఆల్జీమర్స్‌ ముప్పుని తగ్గిస్తాయి.

విటమిన్‌ ఎ కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
అల్లం, క్యారట్, యాపిల్‌ కలిపి తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరి గుణాలు శరీరానికి పుష్కలంగా అందుతాయి.
దీనివల్ల దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు దరిచేరవు. ఆరెంజ్‌లోని విటమిన్‌ సి శరీరానికి తగినంత అందుతుంది.
రోజుకొక గ్లాసు ఈ జ్యూస్‌ తాగడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా తయారవుతాయి.

క్యారట్‌ యాపిల్‌ జ్యూస్‌ తయారీకి కావలసినవి:
తొక్కతీసి తరిగిన క్యారట్‌ ముక్కలు – కప్పు, యాపిల్‌ ముక్కలు – కప్పు, తొక్క తీసిన నారింజ లేదా కమలా తొనలు – కప్పు, అల్లం తరుగు – టీస్పూను, ఐస్‌ క్యూబ్స్‌ – కప్పు. 

తయారీ విధానం:
ముక్కలన్నింటిని బ్లెండర్లో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.
అన్ని ముక్కలు మెదిగాక కొన్ని ఐస్‌క్యూబ్స్‌ వేసి మరోసారి గ్రైండ్‌ చేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడగట్టి జ్యూస్‌ని గ్లాసులో వేయాలి.
దీనిలో ఐస్‌క్యూబ్స్‌ వేసి సర్వ్‌ చేసుకోవాలి.
వేసవిలో ట్రై చేయండి: Mango Mastani: మ్యాంగో మస్తానీ తాగుతున్నారా.. ఇందులోని సెలీనియం వల్ల!

మరిన్ని వార్తలు