Kachi Keri Sharbat In Telugu: పచ్చి మామిడి ఆరోగ్య ప్రయోజనాలు.. దీనిని ఉప్పుతో కలిపి తీసుకుంటే

21 May, 2022 09:42 IST|Sakshi

Summer Drinks: వేసవి అంటే మామిడి పండ్ల సీజన్‌. కేవలం పండ్లతోనే కాదు.. పచ్చి మామిడితోనూ ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

పచ్చిమామిడికాయ ముక్కలను ఉప్పుతో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని నీరు బయటకు పోకుండా ఉంటుంది.
అంతేగాక శరీర ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉంటాయి.
దీనితో తయారు చేసే కచ్చీకేరి షర్బత్‌ షర్బత్‌లో పుష్కలంగా సి విటమిన్‌ ఉండడం వల్ల, సి విటమిన్‌ లోపం వల్ల వచ్చే స్కర్వి వ్యాధిని ఈ డ్రింక్‌ నిరోధిస్తుంది. 
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల చెమట రూపంలో చాలా నీరు పోతుంది. ఈ నీటిలో కీలకమైన ఖనిజ పోషకాలు ఐరన్, సోడియం, క్లోరైడ్‌లు కూడా బయటకు వెళ్లి పోతాయి. పచ్చిమామిడి ఈ పోషకాలను బయటకు పోనీయకుండా నియంత్రిస్తుంది.
అజీర్ణం, డయేరియా వంటి ఉదర సమస్యలు ఈ షర్బత్‌ తాగితే తగ్గుతాయి. 

పచ్చిమామిడి రక్తహీనత, క్యాన్సర్, అధిక రక్తస్రావాన్ని నిరోధించడంతోపాటు, రోగనిరోధక వ్యవస్థను మరింత దృఢంగా మారుస్తుంది. 
పచ్చిమామిడి కాలేయ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
దంతాలు, చిగుళ్లను కూడా రక్షిస్తుంది.
నోటి నుంచి వెలువడే దుర్వాసనను రానివ్వదు. 
మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న పచ్చి మామిడితో కచ్చీకేరి షర్బత్‌ షర్బత్‌ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా!

కచ్చీకేరి షర్బత్‌ తయారీకి కావలసినవి:
తొక్కతీసిన పచ్చిమామిడికాయ ముక్కలు – అరకప్పు, పుదీనా ఆకులు – పది, పంచదార – టీస్పూను, వేయించిన జీలకర్ర పొడి – టీస్పూను, రాక్‌సాల్ట్‌ – టీస్పూను, నీళ్లు – మూడు కప్పులు, ఐస్‌క్యూబ్స్‌ – ఆరు.  

తయారీ:
మామిడికాయ ముక్కలు, పంచదార, పుదీనా ఆకులు, జీలకర్ర పొడి , రాక్‌సాల్ట్‌ను బ్లెండర్‌లో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి 
ఇవన్నీ గ్రైండ్‌ అయ్యాక నీళ్లుపోసి మరోసారి గ్రైండ్‌ చేయాలి 
ఈ మిశ్రమాన్ని వడగట్టి జ్యూస్‌ని గ్లాస్‌లో తీసుకుని ఐస్‌క్యూబ్స్‌ వేసుకుంటే రుచికరమైన, ఆరోగ్యకరమైన సమ్మర్‌ డ్రింక్‌ కచ్చీ కేరి షర్బత్‌ రెడీ.

వేసవిలో ట్రై చేయండి: Mango Mastani: మ్యాంగో మస్తానీ తాగుతున్నారా.. ఇందులోని సెలీనియం వల్ల!

మరిన్ని వార్తలు