Mango Mastani: మ్యాంగో మస్తానీ తాగుతున్నారా.. ఇందులోని సెలీనియం వల్ల!

20 May, 2022 09:41 IST|Sakshi

Summer Drinks- Mango Mastani Recipe: మంచి ఎండలో బయట నుంచి ఇంటికి వచ్చాక మ్యాంగో మస్తానీ తాగితే దాహం తీరుతుంది. ఎంతో రుచిగా ఉండే ఈ మస్తానీ తాగే కొద్ది తాగాలనిపిస్తుంది.

ఈ ఒక్క జ్యూస్‌ తాగడం వల్ల.. విటమిన్‌ ఎ, బి2, బి6, బి12, సి, డి, క్యాల్షియం, అయోడిన్, ఫాస్ఫరస్, పొటాషియం, పీచుపదార్థం, ఫోలేట్, మెగ్నీషియం, మ్యాంగనీస్, సెలీనియంలు శరీరానికి పుష్కలంగా అందుతాయి. యాంటీ ఆక్సిడెంట్‌ అయిన సెలీనియం రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడుతుంది.

మ్యాంగో మస్తానీ తయారీకి కావాల్సినవి:
మామిడి పండు ముక్కలు – కప్పు, చల్లటి క్రీమ్‌ మిల్క్‌ – కప్పు, జాజికాయ పొడి – చిటికెడు, ఐస్‌క్యూబ్స్‌ – పావు కప్పు, పంచదార – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు, ఐస్‌క్రీమ్‌ – రెండు స్కూపులు, చెర్రీ, పిస్తా, బాదం పప్పు, టూటీప్రూటీ, మామిడి ముక్కలు – గార్నిష్‌కు సరిపడా, ఉప్పు – చిటికెడు. 

మ్యాంగో మస్తానీ తయారీ విధానం:  
మామిడి పండు ముక్కల్ని బ్లెండర్లో వేయాలి.
దీనిలో పంచదార, జాజికాయ పొడి, ఉప్పు వేసి ప్యూరీలా గ్రైండ్‌ చేయాలి.
ఈ ప్యూరీలో పాలు, ఐస్‌క్యూబ్స్‌ వేసి మరోసారి గ్రైండ్‌ చేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంగుళం గ్యాప్‌ ఉండేలా గ్లాసులో పోయాలి.
గ్లాసులో గ్యాప్‌ ఉన్న దగ్గర ఐస్‌క్రీమ్, మామిడి పండు ముక్కలు, డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.  

వేసవిలో ట్రై చేయండి: Summer Drinks: రోజు గ్లాసు బీట్‌రూట్‌ – దానిమ్మ జ్యూస్‌ తాగారంటే..

మరిన్ని వార్తలు