Lemon Juice: నిమ్మరసంలో పంచదార కలుపుకొని తాగుతున్నారా? అయితే

31 Mar, 2022 18:37 IST|Sakshi

దాదాపు ప్రపంచమంతటా వినియోగంలో ఉన్న వేసవి పానీయం నిమ్మరసం. తాజా నిమ్మరసానికి చిటికెడు ఉప్పు, రుచికి తగినంత పంచదార, చల్లని నీరు కలిపి తాగితే ఎండ తాకిడి నుంచి సత్వర ఉపశమనం కలుగుతుంది. నిమ్మరసంలోని విటమిన్‌–సి రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది. డీహైడ్రేషన్‌ నుంచి కాపాడుతుంది.

అధికబరువు తగ్గించుకోవడానికి నిమ్మరసంలో పంచదారకు బదులుగా తేనె కలుపుకోవడం మంచిది. వేసవిలో రోజూ నిమ్మరసం తీసుకునేటట్లయితే వేసవిలో తలెత్తే చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. వేసవిలో కాఫీ, టీ వంటివి తగ్గించి నిమ్మరసం తీసుకోవడం మంచిది.

చదవండి: Curd Rice: వేసవిలో తినడానికి అనువైన చక్కని పోషకాహారం.. ఇలా చేస్తే అదనపు రుచి!

మరిన్ని వార్తలు