Summer Drinks: మ్యాంగో పిప్మర్మెంట్‌ లస్సీ.. ఆహారం జీర్ణమవడంతో పాటుగా..

28 Apr, 2022 10:04 IST|Sakshi

Mango Peppermint Lassi Recipe: పుదీనా, నిమ్మరసం ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఇక వేసవిలో లభించే మామిడిపండు కలిగించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇందులోని పొటాషియం, మెగ్నీషియం బీపీని కంట్రోల్‌ చేస్తాయి. విటమిన్‌ సీ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇలా చెప్పుకొంటూ పోతే ఇంకెన్నో ఉపయోగాలు.

మరి మండే ఎండల్లో మధ్యాహ్నం పూట వీటితో తయారు చేసిన మ్యాంగో పిప్మర్మెంట్‌ లస్సీ తాగితే దాహార్తి తీరుతుంది. అంతేకాదు ఇందులోని పోషకాలు చర్మం, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ ఇంట్లో ఈ సమ్మర్‌ డ్రింక్‌ను ఈజీగా తయారు చేసుకోండి.

మ్యాంగో పిప్మర్మెంట్‌ లస్సీ తయారీకి కావాల్సిన పదార్థాలు:
మామిడిపండు గుజ్జు – కప్పు, పంచదార – నాలుగు టేబుల్‌ స్పూన్లు, పుదీనా తరుగు – మూడు టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి – టీస్పూను, నిమ్మరసం – టేబుల్‌ స్పూను, పెరుగు – నాలుగు కప్పులు, ఐస్‌ ముక్కలు – కప్పు

తయారీ విధానం:
బ్లెండర్‌లో మామిడి పండు గుజ్జు, పుదీనా, పాలు, యాలకుల పొడి, నిమ్మరసం వేసి గ్రైండ్‌ చేయాలి.
ఇవన్నీ గ్రైండ్‌ అయ్యాక పెరుగు, ఐస్‌ ముక్కలు వేసి మరోసారి గ్రైండ్‌ చేసి సర్వ్‌చేసుకోవాలి.

చదవండి👉🏾Boppayi Banana Smoothie: ఈ స్మూతీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే!

మరిన్ని వార్తలు