Summer Tips: స్విమ్‌ చేస్తే చర్మం పాడైపోతుందా? ఈ చిట్కాలు పాటిస్తే సరి!

6 Apr, 2022 10:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సమ్‌... స్విమ్‌ మరింత భద్రంగా.

Swim Safety And Skin Care Tips In Summer: వేసవి కాలంలో స్విమ్మింగ్‌ చేయడానికి చాలామంది ఇష్టపడ్డప్పటికీ, మరోవైపు చర్మం పాడైపోతుందని బాధపడతుంటారు. ఎటువంటి ఆందోళన చెందకుండా స్విమ్మింగ్‌ ఎలా చేయవచ్చో చూద్దాం..  

ఉదయం పది గంటల లోపు లేదా సాయంత్రం నాలుగు గంటల తరువాత స్విమ్మింగ్‌ చేయాలి.
పూల్‌లో దిగడానికి కనీసం ఇరవై నిమిషాల ముందు వాటర్‌ప్రూఫ్‌ సన్‌స్క్రీన్‌ రాసుకోవాలి.
కళ్లను చక్కగా కవర్‌ చేసి, భద్రంగా కాపాడే కళ్లజోడుని తప్పనిసరిగా ధరించాలి.
ఎటువంటి రంధ్రాలు లేని క్యాప్‌ను తలకు పెట్టుకోవాలి.
దీనివల్ల నీటిలో ఉన్న రసాయనాలు, క్లోరిన్‌ వంటివి జుట్టుకు హాని చేయవు.
స్విమ్మింగ్‌ అయిన వెంటనే తప్పనిసరిగా స్నానం చేయాలి.
తరువాత తడిలేకుండా ఒంటిని తుడుచుకుని మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.
డైమెథికోన్, గ్లిజరిన్, ఆయిల్‌ లేదా పెట్రోలేటియం ఉన్న మాయిశ్చరైజర్‌ వాడితే మరింత మంచిది.
స్విమ్మింగ్‌కు వెళ్లడానికి ముందు, వెళ్లివచ్చిన తరువాత రెండుసార్లు మాయిశ్చరైజర్‌ రాసుకుంటే మరింత మంచిది.  

చదవండి: Health Tips: కీర దోసకాయలు ఎక్కువగా తింటున్నారా.. ఈ విషయాలు తెలిస్తే!

మరిన్ని వార్తలు