Summer Tips: వేసవిలో విజృంభించే కామెర్లు, అతిసార.. ఈ ‘పానీయం’ తాగారంటే!

30 Mar, 2022 14:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

Coconut Water Benefit In Summer: వేసవిలో అత్యద్భుతమైన సహజ పానీయం కొబ్బరినీరు. దీనికోసం ప్రత్యేకించి ఎలాంటి తంటాలు పడనక్కర్లేదు. కొబ్బరిబోండాన్ని కొట్టి నేరుగా లోపలి నీరు తాగేయడమే. కొబ్బరినీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు శరీరానికి శక్తినిస్తాయి. కొబ్బరిని పండించే ప్రతి దేశంలోనూ ప్రజలు కొబ్బరినీటిని ఇష్టంగా తాగుతారు.

ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాల్లో కొబ్బరినీటి వినియోగం ఎక్కువ. దాదాపు నాలుగైదు దశాబ్దాల కిందట కాంబోడియాలో కొబ్బరినీటిని రోగులకు సెలైన్‌గా కూడా ఇచ్చేవారు. వేసవితాపం నుంచి కొబ్బరినీరు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. వేసవిలో విజృంభించే కామెర్లు, అతిసార వంటి రోగాలతో బాధపడేవారికి కొబ్బరినీరు చాలా సురక్షితమైన పానీయం.  

చదవండి: Ambali Health Benefits: అంబలి తాగుతున్నారా.. స్థూలకాయం, మధుమేహం.. ఇంకా

మరిన్ని వార్తలు