చిన్న చిన్న ఆనందాలను ఎక్కువగా ఇష్టపడుతుంటా... అదే నా బ్యూటీ సీక్రేట్‌: కృతి శెట్టి

28 Nov, 2021 09:56 IST|Sakshi
కృతి శెట్టి

తొలి సినిమాతోనే అదృష్టం ఆమెను  ‘ఉప్పెన’లా ముంచెత్తింది. ఎస్‌.. ఇక్కడ కృతి శెట్టి ఫాలో అయ్యే ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ గురించే తెలుసుకోబోతున్నాం. దృష్టి సారించండి...  

పెర్నియా పాప్‌ అప్‌ షాప్‌
అందమైన డిజైన్స్‌ అందించే ఫ్యాషన్‌ డిజైనర్స్‌కు, వాటిని ధరించి ఆనందించే ఫ్యాషన్‌ ప్రియులకు మధ్య  వారధి ఈ ‘పెర్నియాస్‌ పాప్‌ అప్‌ షాప్‌’. ఇదొక ఆన్‌లైన్‌ స్టోర్‌. చిన్న నుంచి పెద్ద వరకు ఎందరో డిజైనర్ల డిజైన్స్‌ ఇక్కడ లభిస్తాయి. ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకునే అవకాశమూ ఉంది. ధరను నిర్ణయించేదీ  డిజైనరే. వైవిధ్యమైన డిజైన్స్‌ను మాత్రమే అందుబాటులో ఉంచుతుందీ స్టోర్‌. ఇందుకు వివిధ పరీక్షలు కూడా నిర్వహిస్తారు. అదే దీని బ్రాండ్‌ వాల్యూ. ప్రత్యక్షంగా కొనుగోలు చేసే అవకాశం లేదు. ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయాలి. 

జ్యూయెలరీ బ్రాండ్‌: పెర్నియాస్‌ పాప్‌ అప్‌ షాప్‌
ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. 

చదవండి: అచ్చం భేతాళ కథల్లో మాదిరి.. ఈ నీటిలో పడితే వెంటనే రాయిలా అయిపోతారు..!

సురభి షా..
పెళ్లిరోజున భర్త ఇచ్చే బహుమతి భార్యకు ప్రత్యేకమే. సురభికి మాత్రం ఆ బహుమతి ప్రత్యేకం కాదు, తనలోని ప్రతిభను పదిమందికి చూపించే ఓ అద్భుతమైన అవకాశం. ఫ్యాషన్‌పై ఉన్న పట్టు, ఆసక్తి, తన దుస్తులను తానే డిజైన్‌ చేసుకునే తీరుకు మెచ్చిన ఆమె భర్త 2006లో ‘సురభి షా’ పేరుతో ఓ బొటిక్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఆ కానుకనే టాప్‌ మోస్ట్‌ ఫ్యాషన్‌ బ్రాండ్స్‌లో ఒకటిగా నిలిపింది సురభి. ఎటువంటి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేయకపోయినా, తన సృజనాత్మక ఆలోచనలతో ఆకట్టుకునే డిజైన్స్‌ను రూపొందిస్తూ అనతికాలంలోనే ఫేమస్‌ డిజైనర్‌గా ఎదిగింది. ఆ కళాత్మకత సెలబ్రిటీలను సైతం మెప్పించింది. ఈ డిజైన్స్‌ సరసమైన ధరల్లోనే లభిస్తాయి. సురభి షా మెయిన్‌బ్రాంచ్‌ జైపూర్‌లో ఉంది. ఆన్‌లైన్‌లోనూ ఆమె డిజైన్స్‌ను కొనుగోలు చేయొచ్చు. 

డ్రెస్‌ డిజైనర్‌ : సురభి షా 
ధర: రూ. 36,000

- దీపిక కొండి 

చదవండి: World's Rarest Dog Breed: ఇది జిరాఫీ కాదు!! కుక్క.. అత్యంత అరుదైన బ్రీడ్‌!! కానీ కారు ప్రమాదంలో..

మరిన్ని వార్తలు