ఇదిగో అమ్మాయ్‌!

14 Aug, 2020 01:17 IST|Sakshi

రియా చక్రవర్తి మీద సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అభిమానులు చాలా కోపంగా ఉన్నారు. అతడి మరణానికి కారణం ఆమేనని వారంతా బలంగా నమ్ముతున్నారు. ఆ నమ్మకానికి అన్ని టీవీ చానళ్లూ ఆజ్యం పోస్తున్నాయి. సుశాంత్‌ మరణానికి, రియాకు ఎంత సంబంధం ఉందో, అసలు ఉందో లేదో కానీ.. ఆమె ఫోన్‌ నెంబర్‌ లోని అంకెలతో దగ్గరి సంబంధం కలిగి ఉన్న ఒక వ్యక్తికి టార్చర్‌ మొదలై ఇప్పటి వరకు ఆయన 150 నంబర్‌లను బ్లాక్‌ చేయవలసి వచ్చింది. రియా నెంబర్‌ కీ, ఆయన నెంబర్‌ కీ ఒక అంకె మాత్రమే తేడా. ముంబైలోని ఒక విద్యాసంస్థలో పనిచేస్తున్న ఆ బాధితుడి పేరు సాగర్‌ సార్వే. కాల్‌ లిఫ్ట్‌ చేయగానే చేసిన వాళ్లెవరో చెప్పకుండా, ఎవరికి చేశారో కూడా తెలుసుకోకుండా డైరెక్టుగా.. ‘రియా.. నువ్వూ..’ అంటూ తిట్టేస్తున్నారట. వారి పోరు పడలేక ప్రస్తుతానికైతే ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి కూర్చుంటున్నాడు సాగర్‌. ఇంతకీ రియా నంబర్‌ ఈ కోపభూయిష్ట ప్రపంచానికి ఎలా తెలిసింది? టీవీ చానల్‌ వాళ్లే పుణ్యం కట్టుకున్నారు. రియా, సుశాంత్‌ ల మధ్య కాల్‌ డేటాను స్క్రీన్‌ పై జూమ్‌ చేసి చూపినప్పుడు నోట్‌ చేసుకున్నట్లున్నారు సుశాంత్‌ ఫ్యాన్స్‌. తొందరలో నోట్‌ చేసుకున్న, తప్పుగా గుర్తు పెట్టుకున్న ఫలితమే సాగర్‌ అనే ఓ సామాన్యుడి జీవితంలోని ఈ పెను తుపాను.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా