Tapsee Pannu: ఆ విషయంలో అస్సలు కాంప్రమైజ్‌ అవను.. నా బ్యూటీ సీక్రెట్‌ అదే! ఇక నా కర్లీ హెయిర్‌..

28 May, 2023 15:22 IST|Sakshi

‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెరంగేట్రం చేసిన మోడల్‌ తాప్సీ పన్ను. 2010లో విడుదలైన ఈ మూవీలో గ్లామర్‌తో ఆకట్టుకున్న ఈ ఢిల్లీ అందం.. 2011లో ఆడుకాలంతో కోలీవుడ్‌లో అడుగిడింది. ఇక వరుణ్‌ ధావన్‌ కామెడీ ఎంటర్టైనర్‌ ‘ఛష్మే బద్దూర్‌’తో బీ-టౌన్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది.

ఆరంభంలోనే కేవలం గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన తాప్సీ.. థప్పడ్‌ వంటి వుమెన్‌ ఓరియంటెడ్‌ సినిమాతో సత్తా చాటింది. నటిగా రోజురోజుకూ మరింత మెరుగుపడుతున్న ఈ సోగకళ్ల సుందరి తన బ్యూటీ సీక్రెట్‌ను రివీల్‌ చేసింది. తన ఉంగరాల జుట్టు అందంగా కనిపించడానికి అమ్మే కారణమంటూ మురిసిపోయింది.

 

నిద్ర దగ్గర అస్సలు కాంప్రమైజ్‌ అవను. కచ్చితంగా ఎనిమిది గంటలు నిద్రపోతాను. స్కిన్‌ కేర్‌లో క్లెన్సింగ్‌..మాయిశ్చరైజింగ్‌.. హైడ్రేటింగ్‌ కంపల్సరీ. అలాగే నా జుట్టు విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా. తెలుసు కదా.. కర్లీ హెయిర్‌ని మేనేజ్‌ చేయడం ఎంత కష్టమో! ఆ క్రెడిట్‌ మా అమ్మదే! 

నా జుట్టు కోసం కొబ్బరి నూనెలో మందార ఆకులు, ఉసిరి ఎట్‌సెట్రా ఇన్‌గ్రీడియెంట్స్‌ వేసి స్పెషల్‌ ఆయిల్‌ తయారు చేస్తుంది. ఆ ఆయిల్‌ని రోజూ రాత్రి తలకు పట్టించి తెల్లవారి తలస్నానం చేస్తా! అందుకే కర్లీ హెయిర్‌ అయినా కాస్త సాఫ్ట్‌గా కనపడుతుంది’’ అని  తాప్సీ పన్ను  చెప్పుకొచ్చింది.

చదవండి: ఆపకుండా గట్టిగా నవ్వితే చనిపోతారా? దీనిలో నిజమెంతంటే...

మరిన్ని వార్తలు