టెక్‌.. టాక్‌: మారుతున్న కాలానుగుణంగా.. ఈ కొత్త టెక్నాలజీ మీకోసం..

1 Mar, 2024 09:01 IST|Sakshi

'అతి వేగంగా పరుగెడుతున్న ఈ కాలాన్ని ఆపడం ఎవరి వలన కాదు. ఈ కాలంతోపాటుగా కొత్త టెక్నాలజీ కూడా అంతే వేగంగా పరుగెడుతుంది. దానిని మనం గుప్పిట్లో దాచి, సరైన క‍్రమంలో.. టెక్నాలజీని ఉపయోగించుటకై సరికొత్త పరికరాలు మీ ముందుకు వస్తున్నాయి. మరి వాటిని గురించి పూర్తిగా తెలుసుకందామా..!'

మిల్క్‌ వే ట్యాబ్‌..
మన దేశ విద్యారంగంలోని కీలకమైన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ టెక్‌ సంస్థల సహాకారంతో ‘ఎపిక్‌’ ఫౌండేషన్‌ రూపొందించిన ట్యాబ్‌ మిల్క్‌ వే.

కొన్ని వివరాలు:

 • సైజ్‌: 8 అంగుళాలు
 • రిజల్యూషన్‌: 1,280“800 పిక్సెల్స్‌
 • మీడియా టెక్‌ 8766 ఏప్రాసెసర్‌
 • 4జీబి ర్యామ్‌/64జీబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌
 • 5,100 ఎంఏహెచ్‌

హానర్‌ మ్యాజిక్‌ బుక్‌ 16ప్రో..

 • సైజ్‌: 16.00 అంగుళాలు
 • రిఫ్రెష్‌ రేట్‌: 165 హెచ్‌జడ్‌
 • రిజల్యూషన్‌: 3072“1920 పిక్సెల్స్‌
 • ఆపరేషన్‌ సిస్టమ్‌: విండోస్‌ 11
 • స్టోరేజ్‌: 16జీబి ప్లస్‌ 512జీబి
 • సపోర్ట్‌: ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌
 • బరువు: 1.75 కేజీ
 • కలర్స్‌: వైట్‌ పర్పుల్‌

ఫ్రెండ్‌ మ్యాప్‌ ఫీచర్‌..

‘ఫ్రెండ్‌ మ్యాప్‌’ అనే కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది ఇన్‌స్టాగ్రామ్‌. ప్లాట్‌ఫామ్‌లోని యూజర్‌లకు తమ స్నేహితుల లోకేషన్‌ను చెక్‌ చేయడానికి ఈ ఫీచర్‌ ఉపకరిస్తుంది. స్నాప్‌చాట్‌లోని ‘స్నాప్‌ మ్యాప్‌’ను పోలిన ఫీచర్‌ ఇది. తమ లొకేషన్‌ను ఎవరు చూడాలో ఎంపిక చేసుకోవడానికి అనుమతిస్తుంది. ‘ఫ్రెండ్‌ మ్యాప్‌’లో యూజర్‌ తన చివరి యాక్టివ్‌ లొకేషన్‌ను దాచే ‘ఘోస్ట్‌ మోడ్‌’ కూడా ఉంటుంది.

స్టిక్కీ నోట్స్‌..

మైక్రోసాఫ్ట్‌ వారి ‘స్టిక్కీ నోట్స్‌’ యాప్‌ కొత్త హంగులతో ముందుకు వచ్చింది. పాత ‘స్టిక్కీ నోట్స్‌’ను రీవ్యాంప్‌ చేసి ఎన్నో కొత్త ఫీచర్‌లు తీసుకువచ్చారు. నోట్స్‌ క్రియేట్‌ చేయడానికి, స్క్రీన్‌ షాట్‌లను తీసుకోవడానికి, ఆడియోను రికార్డ్‌ చేయడానికి ఇది యూజర్‌లను అనుమతిస్తుంది.

ఇవి చదవండి: అసలు వీటి గురించి మీకు తెలుసా..!

whatsapp channel

మరిన్ని వార్తలు