పిల్లలు నిద్రలో పళ్లు కొరుకుతున్నారా?

17 Mar, 2021 09:12 IST|Sakshi

చిన్నారులు నిద్రలో పళ్లు కొరికే కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘బ్రక్సిజం’ అంటారు. పిల్లల్లో ఇది చాలా సాధారణం. ఇది పిల్లల మెుదటి ఐదేళ్ల వ్యవధిలో మెుదలయ్యే సమస్య. కొందరు పెద్దవాళ్లలోనూ ఈ సమస్య ఉండవచ్చు. ఇది ఎందువల్ల వస్తుందనేందుకు నిర్ణీతంగా కారణాలు తెలియదు. సాధారణంగా ఆందోళన, కోపం, వ్యాకులత, కంగారు, తొందరపాటుతో ఉండటం, పోటీ తత్వంతో వ్యవహరించడం వంటి లక్షణాలున్న పిల్లల్లో ఈ బ్రక్సిజం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముందుగా పిల్లల్లో ఆందోళన, వ్యాకులత తగ్గించాలి. నిద్రకు ఉపక్రమించే ముందర వాళ్లను ఆహ్లాదంగా ఉంచడానికి ప్రయత్నించాలి.

వాళ్లతో ఎక్కువగా సంభాషిస్తూ ఉండాలి. ఆ చిన్నారుల వునసుల్లో ఉన్న భయాలు, శంకలు తొలగించేలా పెద్దలు వ్యవహరించాలి. వాళ్ల పట్ల కన్సర్న్‌ చూపాలి. పిల్లలు నిద్రకు ఉపక్రమించే సవుయంలో కెఫిన్‌ ఎక్కువగా ఉండే పదార్థాలు (కాఫీ, చాక్లెట్లు వంటివి) పెట్టకూడదు. సమస్య వురీ ఎక్కువగా ఉంటే నోట్లో అవుర్చే మౌత్‌ గార్డ్స్, మౌత్‌పీసెస్‌ వాడితే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఈ సమస్య వల్ల కొన్నిసార్లు పళ్ల (డెంటల్‌) సమస్యలు – వూల్‌ అక్లూజన్, పళ్లు వదులుకావడం (లూజెనింగ్‌), పళ్లు పడిపోవడం, దడవ ఎముక జాయింట్‌ (టెంపోరో వూండిబులార్‌ జాయింట్‌) సమస్యలు కూడా రావచ్చు. అలాంటి సందర్భాల్లో దంతవైద్య నిపుణలను కలవాల్సి ఉంటుంది.

చదవండి: ఈ యాడ్స్‌లో నటించిన సెలబ్రిటీలు వీళ్లే..

మరిన్ని వార్తలు