మీకు తెలుసా?

18 Feb, 2023 03:29 IST|Sakshi

పాలు అనగానే సాధారణంగా గేదెపాలు లేదా ఆవుపాలే అందరికీ తెలుసు. అయితే ఇటీవల గాడిదపాలు, మేకపాలు కూడా కొందరు తాగుతున్నారు. ఇవే కాదు, కొబ్బరిపాలు కూడా ఉన్నాయి. పచ్చికొబ్బరిని కోరి లేదా ముక్కలు చేసి తగినన్ని నీళ్లు చేర్చి రుబ్బి, వడపోయడం ద్వారా కొబ్బరిపాలను తయారు చేయవచ్చు. కొబ్బరిపాలను తాగడం ద్వారా చాల ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాం...

♦ ఆవు పాలకు సమానమైన పోషకాలను కలిగి ఉంటాయి.
♦ యాంటీ వైరల్‌ గుణాలు సమృద్ధిగా ఉండటంతో రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి.
♦ శరీరంలో ఏర్పడే ఒత్తిడి తగ్గించడంతో పాటు కీళ్ల నొప్పులకు మందులా పనిచేస్తాయి.
♦ ఫాస్ఫరస్, కాల్షియం వంటి పోషకాలు ఉండడంతో దంతాలు, ఎముకలు బలంగా మారతాయి. మీ పిల్లలు మామూలు పాలు తాగడానికి మొగ్గు చూపనప్పుడు ఒకసారి కొబ్బరిపాలను పట్టించడానికి ప్రయత్నించండి. మంచి ఫలితం ఉంటుంది.

మరిన్ని వార్తలు