Tips for Stronger Nails: గోళ్లు విరిగిపోతున్నాయా..? అయితే ఇలా చేయండి

6 Jul, 2022 09:35 IST|Sakshi

బ్యూటిప్స్‌

వర్షాకాలంలో అధికంగా ఉండే తేమకు గోళ్లు విరిగిపోతుంటాయి. గోరు చుట్టూ ఉన్న చర్మం మరింత సున్నితంగా మారి పాడవుతుంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే...

  • రాత్రి పడుకునే ముందు సైంధవ లవణం వేసిన నీటిలో పది నిమిషాలపాటు వేళ్లను నానబెట్టాలి. తరువాత తడిలేకుండా తుడిచి క్రీమ్‌ రాసుకుని సున్నితంగా మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల గోళ్లు పెళుసుబారకుండా ఉండటంతోబాటు గోళ్ల చుట్టూ ఉన్న చర్మం మృదువుగా మారుతుంది. 
  • ఆలివ్‌ ఆయిల్‌లో గోళ్లను మర్దన చేస్తే మరింత షైనింగ్‌గా కనిపిస్తాయి. ఆలివ్‌ ఆయిల్‌ను వేడిచేసి గోళ్ల మీద వేసి మర్థన చేయాలి. మర్దన తరువాత నీటితో కడిగేయాలి. రోజుకి రెండు సార్లు ఇలా చేయడం వల్ల గోళ్లు మరింత అందంగా మెరుస్తాయి.
  • గోరు చుట్టూ ఉన్నచర్మానికి క్యూటికల్‌ సమస్య బాధిస్తుంటే తేనె రాసి మర్దన రాసి చేయాలి. పదిహేను నిమిషాల తరువాత నీటితో కడిగి తుడవాలి. తరువాత మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్యూటికల్‌ తగ్గు ముఖం పడుతుంది. 
  • పచ్చిపాలలో ప్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి గోళ్లు, చుట్టూ ఉన్న చర్మాన్ని ఆరోగ్యం ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. రోజూ రాత్రి పడుకునేముందు పచ్చిపాలలో చేతివేళ్లను పదినిమిషాలపాటు నానపెట్టి తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల వర్షాకాలంలో గోళ్లు ఆరోగ్యంగా అందంగా ఉంటాయి.  
మరిన్ని వార్తలు