ఒత్తిడి నివారణకు ఆయుర్వేద చిట్కాలివే..

19 Sep, 2020 18:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒత్తిడి, డిప్రెషన్‌ (మానసిక ఆందోళన)తో మెజారిటీ ప్రజలు బాధపడుతున్నారు. కొన్ని ఆయుర్వేద చిట్కలతో ఒత్తిడి సమస్యను నివారించవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. భారత ఆయుర్వేదానికి గణనీయమైన చరిత్ర ఉంది. గత 2వేల సంవత్సరాలుగా అనేక జబ్బులకు ఆయుర్వేద వైద్యం దివ్యౌషదంగా పని చేసింది. అయితే ఇటీవల కాలంలో జబ్బులు నయం కావడానికి ఆయుర్వేద వైద్యం చాలా సమయం తీసుకుంటుందని కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అపోహలకు దీటుగా ఆయుర్వేద నిపుణులు చక్కటి విశ్లేషణతో దీటైన కౌంటర్‌ ఇస్తున్నారు.

ఒత్తిడిని ఎదుర్కొనే ఆయుర్వేద వైద్యంపై విశ్లేషణ:
ఆయుర్వేద వైద్యంలో ఒత్తిడి సమస్యకు నాడీ వ్యవస్థ మూలమని భావిస్తారు. మానసిక సమస్యలను దోషా అనే ప్రక్రియ నియంత్రిస్తుంది. కాగా నరాల వ్యవస్థను బలంగా ఉంచే వాత ప్రక్రియ ద్వారా శారీరక, మానసిక సమస్యలను అధిగమించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలిపారు. తీవ్ర ఒత్తిడి సమస్యను నివారించేందుకు పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం పరిష్కార మార్గంగా నిపుణులు చెబుతున్నారు. 

ఒత్తిడిని అధిగమించేందుకు ప్రాచీన కాలం నుండి హెడ్ మసాజ్ ప్రక్రియ చాలా ప్రాచుర్యం పొందింది. అయితే తల, మెడ ప్రాంతాలను మసాజ్‌ చేయడం ద్వారా ప్రశాంతమైన నిద్రతో పాటు రక్త ప్రసరణను పెంచుతుంది. దీంతో పాటు చర్మం, జుట్టు సమస్యను నివారిస్తుంది. కాగా మసాజ్‌ చేయుటకు నారాయణ తైలా, బ్రాహ్మి నూనె వంటి సహజ నూనెలను ఉపయోగిస్తారు. 

సమతుల్య ఆహారం ద్వారా ఒత్తిడి నివారణ
మనిషికి ఏం కావాలో శరీరం సిగ్నల్స్‌ ఇస్తుంది. అలాగే శరీరం కోరుకున్న సమయంలో ఆహారం తీసుకోవడం ద్వారా హార్మోన్ల సమస్యను నివారించవచ్చని తెలిపారు. కాగా విటమిన్‌ సీ, బీ, ఒమెగా, మాగ్నిషియమ్‌ కలిగిన ఆహారాలను తీసుకోవడం ద్వారా ఒత్తిడిని ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఒత్తిడి సమస్యను నివారించేందుకు క్రమం తప్పకుండా యోగాను సాధన చేయాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు 
 

మరిన్ని వార్తలు