వెడ్డింగ్‌ యానివర్సరీ : మహేష్‌కు, నమ్రత విషెస్‌, వైరల్‌ పోస్ట్‌

10 Feb, 2024 13:00 IST|Sakshi

టాలీవుడ్‌లో మోస్ట్‌ లవబుల్‌ అండ్‌  బెస్ట్ పవర్ కపుల్ అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్   గుర్తొస్తారు. ఈ రోజు  వారి 19వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నమ్రతా ఒక అందమైన పప్పీల జంట వీడియోతో అందంగా విషెస్‌ చెప్పింది. దీంతో ఫ్యాన్స్‌ అంతా శుభాకాంక్షలతో సందడి చేస్తున్నారు.

ఫిబ్రవరి 10, 2005న ఈ లవబర్డ్స్‌ పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ముద్దుల తనయ సితార తనదైన స్టయిల్‌లో దూసుకుపోతూ ఘట్టమనేని కుటుంబ వారసత్వాన్ని నిలబెడుతోంది. అంటు గౌతమ్ కూడా భిన్న రంగంలో తానేంటో నిరూపించుకున్నాడు.

కరీయర్‌ పీక్‌ స్టేజ్‌లో ఉండగా పెళ్లి చేసుకున్న నమ్రత ప్రస్తుతం నటనకు గుడ్‌బై చెప్పి కుటుంబ జీవితంపై దృష్టి పెట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికపుడు  విశేషాలను పంచుకుంటూ ఉంటుంది.

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega