Health Tips: ఖాళీ కడుపుతో యాపిల్‌ పండు తింటే..

2 Apr, 2022 11:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆరోగ్య చిట్కాలు

ఏదైనా మితంగా తినడమే ఉత్తమం. రుచిగా ఉంది కదా అనో, ఇష్టం అనో– పులిహోర ఎక్కువగా తింటే కడుపు బరువుగా ఉన్నట్లు ఉంటుంది. అలాంటప్పుడు పులిహోర తిన్న వెంటనే – గోరు వెచ్చని నీరు ఒక గ్లాసుడు తాగేస్తే – తొందరగా జీర్ణం అవుతుంది. వేడి కూడ చేయదు.

ఇక పుదీనారసం ఎండ తాపాన్ని తగ్గిస్తుంది. ఎండకాలంలో రోజుకో గ్లాసు పుదీనారసం తాగితే శరీర ఉష్ణోగ్రత వాతావరణానికి అనుకూలంగా సమన్వయమవుతుంది. పిల్లలకు పుదీనా రసాన్ని తాగించడం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది.
పైత్యం, ఆ కారణంగా తలతిప్పటం వంటి సమస్యలున్నప్పుడు జీలకర్రను మెత్తగా నూరి, ఆ పేస్ట్‌ను నీటిలో కలిపి తాగాలి. ఇలా రెండు రోజుల పాటు రోజుకు రెండుసార్లు చేయాలి.
పొద్దున లేవగానే ఖాళీ కడుపుతో యాపిల్‌ పండు తింటే తలనొప్పి తొందరగా తలెత్తదు.
ప్రతి రోజూ రెండుసార్లు తప్పనిసరిగా బ్రష్‌ చేసుకోవాలి. ఏదైనా తిన్న ప్రతీసారీ ఆహారం తాలుకా అవశేషాలు నోట్లో మిగలకుండా మంచి నీటితో పుక్కిలించాలి.
రోజు ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో ఒక్కొక్కటి నాలుగైదు చొప్పున తులసి, వేప ఆకులను, ఐదారు మిరియాలను వేసి మరిగించి తాగాలి. (హై బీపీతో బాధపడుతున్న వాళ్లు మినహాయించాలి). 

చదవండి: Ugadi 2022: శ్రీ శుభకృత్‌ నామ సంవత్సర (2022 – 23) రాశిఫలాలు

మరిన్ని వార్తలు