టాప్‌ టు బాటమ్‌; సేమ్‌.. సేమ్‌.. చమక్కులు

22 Jan, 2022 17:39 IST|Sakshi

పువ్వుల నవ్వులు.. ప్లెయిన్‌ హంగులు కుచ్చుల చమక్కులు.. ఎంబ్రాయిడరీ మెరుపులు ఒకే రంగుతో ఆకట్టుకుంటే అది నేటి పార్టీవేర్‌ లెహంగా డ్రెస్‌ అవుతుంది. అంచుల రంగుతో ఓణీ.. అదే రంగుతో ఛోలీ అనే నిన్నటి కళ కు చుక్కను చుట్టి టాప్‌ టు బాటమ్‌ ఒకే కలర్‌.. ఒకే ప్రింట్‌.. ఒకే వర్క్‌... అంటూ  లెహంగా డ్రెస్సులను కొత్త కళతో మెరిపిస్తున్నారు డిజైనర్లు. వేడుకులకు నిండైన కళను తీసుకువస్తున్నారు. 

చిన్ని చిన్ని మార్పులు
ఒకే రంగుతో ప్లెయిన్‌ లెహంగా డ్రెస్‌ వెస్ట్రన్, గెట్‌ టు గెదర్‌ పార్టీలకు వన్నె తీసుకువస్తున్నాయి. ఇక ఒకే కలర్‌ లెహంగా, ఛోలీ, దుపట్టాపై కొన్ని ప్రింట్లు, మరికొన్ని ఎంబ్రాయిడరీ వర్క్‌తో చేసిన డిజైన్స్‌ వివాహ వేడుకలకు నిండుదనాన్ని తీసుకువస్తున్నాయి. వీటిలో ఫ్లోరల్‌ డిజైన్స్‌ నేటి మగువలను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. (క్లిక్‌: మెడలో పర్సుల హారాలు.. భలే ఉన్నాయ్!)

మరిన్ని వార్తలు