‘టాయ్‌బాక్స్‌ 3డీ ప్రింటర్‌’ అంటే ఏంటో తెలుసా?

20 Mar, 2021 19:03 IST|Sakshi

‘దాదీ... నాకు బొమ్మ తేవాలి’ అని మన ముద్దుల పిల్లాడు అడిగాడే అనుకుందాం. ‘ఇప్పుడెక్కడ తేగలం’ అని రకరకాల సాకులు వెదుక్కుంటాం. ఇక ముందు అలాంటి పరిస్థితి రాదు. ఇంట్లోనే టీ, కాఫీలు చేసి ఇచ్చినట్లే బుజ్జి బుజ్జి బొమ్మలు తయారుచేసి పిల్లలకు ఇవ్వవచ్చు. ‘టాయ్‌బాక్స్‌ 3డీ ప్రింటర్‌’తో ఇది సాధ్యమవుతుంది. ఈ ప్రింటర్‌తో పాటు కేటలాగ్‌ కూడా ఇస్తారు.

దీనిలో మనకు ఇష్టమైన బొమ్మలను, ఇష్టమైన రంగులతో టకటకా తయారుచేసుకోవచ్చు. దీనితోపాటు సొంతంగా డిజైన్లను రూపొందించుకొని వాటికొక రూపం కూడా  ఇవ్వవచ్చు. ఈ బయోడిగ్రేడబుల్‌ ప్రింటర్‌ బరువు 3 కేజీలు, మన సంతోషం బరువు వంద కేజీలు!

మరిన్ని వార్తలు