దసరా ఉత్సవాలు 75 రోజుల ముందే మొదలు

9 Oct, 2021 08:33 IST|Sakshi

బస్తర్‌

ప్రకృతి పచ్చదనం మధ్య అచ్చంగా అడవి బిడ్డల ఆనందడోలికలలో సాగే వేడుక ఇది. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌లో దసరా రెండున్నర నెలల పండగ. విజయదశమికి 75 ముందే మొదలవుతుంది. ఈ దండకారణ్య వేడుకలో ఆదివాసీలు ఆనందంగా పాల్గొంటారు. ఈ పండగకు దంతేశ్వరీ దేవిని పూజిస్తారు. ఆదివాసీలు రాముడిని తమ అతిథిగా భావిస్తారు. పద్నాలుగేళ్ల వనవాసం చేసింది తమ దగ్గరే అని చెబుతారు. జాతికులమతాల పరిధులేవీ లేని వేడుకలివి. రథయాత్ర కోసం ఏటా అడవిలో కలపను సేకరించి ఎనిమిది చక్రాల కొత్త రథాన్ని తయారు చేస్తారు. రథం కోసం కలప సేకరణ ఈ వేడుకలో తొలి ఘట్టం. ఆ వేడుకను పత్‌ జాతర అంటారు.
చదవండి: Beauty of Nature: ఈ చెట్లు ఒయ్యారంగా సాల్సా డాన్స్‌ చేస్తాయట.. ఆశ్యర్యం!!

పదవ రోజు మురియా దర్బార్‌తో వేడుకలు ముగుస్తాయి. బస్తర్‌ ప్రజలు దర్బారులో తమ సమస్యలను రాజుకు విన్నవించుకునే ఘట్టం అది. బస్తర్‌ దసరా వేడుకల్లో ఘోతుల్‌ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది యువతీయువకులకు తమ భాగస్వామిని ఎంచుకునే అవకాశం కల్పించే వేడుక. గుజరాత్‌ నవరాత్రి వేడుకలో గర్భా నాట్యంలాగ అన్నమాట. దసరా వేడుకల సమయంలో బస్తర్‌ యాత్రకు వెళ్తే ఆదివాసీ సంగీతవాద్యాలు, నాట్యరీతులు, వస్త్రధారణను చూడవచ్చు. ఆదివాసీ మహిళలు ఎర్రటి సంప్రదాయ దుస్తులతో వేడుకల్లో పాల్గొంటారు. ప్రభుత్వం నిర్వహించే వేడుకలో రాజకుటుంబ వారసులు కూడా పాల్గొంటారు. 
చదవండి: Chowmahalla Palace: ప్యాలెస్‌ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?!

మరిన్ని వార్తలు