రాత్రిళ్లు అకస్మాత్తుగా చెమటలు పడుతున్నాయా? బీ కేర్‌ఫుల్‌ అంటున్న వైద్యులు!

24 Oct, 2023 13:12 IST|Sakshi

చాలామందికి రాత్రిళ్లు అకస్మాత్తుగా ఉన్నటుండి చెమటుల పడుతుంటాయి. చాలమంది వేడి చేసిందనో మరేదో సాకుతో కొట్టిపడేస్తారు. సీరియస్‌గా తీసుకోను కూడా తీసుకోరు. ఒక్కొసారి నలతగా ఉన్న ఇలా ఉంటుంది కదా అని చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఆ నిర్లక్ష్యమే మన ప్రాణాలు కోల్పోయేలా చేస్తుంది. అందుకు ఉదహారణే యూకేకు చెందిన వ్యక్తి

యూకేలోని బార్న్స్‌లీలో క్లర్క్‌గా పనిచేస్తున్న 48 ఏళ్ల ఫిర్త్‌కి రాత్రిళ్లు ఉన్నటుండి చెమటలు పట్టేసేవి. ఒళ్లునొప్పులు వల్ల అయ్యి ఉండొచ్చని, పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. ఇలానే తరుచుగా అనిపించడంతో చివరికి ఓ రోజు డాక్టర్‌ని సంప్రదించాడు. ఫిజియోథెరపీ తీసుకుంటే తగ్గిపోతుందనే అనుకున్నాడు. అదే విషయాన్ని వైద్యుడితో కూడా చెప్పాడు. కానీ వైద్యులు అనుమానంతో ఫిర్త్‌కి కొన్ని వైద్య పరీక్షయలు నిర్వహించారు.

ఆ పరీక్షల్లో అతడు మైలోయిడ్‌ లుకేమియా అనే క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. రాత్రిళ్లు ఇలా చెమటు పట్టడానికి ఈ క్యాన్సర్‌ కారణంగాననే తేలింది. కానీ ఫిర్త్‌ తేలిగ్గా తీసుకోవడం కారణంగా ఆ క్యాన్సర్‌ స్టేజ్‌ కూడా దాటింది. ఈ వ్యాధి నిర్ధారణతో ఫిర్త్‌ కుటుంబ విలవిలలాడింది. అతడి భార్య, ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏంటని తీవ్ర మనోవ్యధకు గురయ్యాడు. ఏదో రకంగా బతకాలని ధైర్యం తెచ్చుకుని మరీ కీమోథెరఫీ చికిత్సలు తీసుకున్నాడు.

అయితే ఈ క్యాన్సర్‌కి స్టెమ్‌ సెల్స్‌ మార్పిడి చికిత్స ఒక్కటే మార్గం. కానీ ఫిర్త్‌కి స్టెమ్‌సెల్‌ మార్పిడి చేయాలంటే కనీసం శరీరంలో 5%కి కంటే తక్కువ క్యాన్సర్‌ కణాలు ఉండాలి. ఫిర్త్‌ రెండు రౌండ్లు కీమో థెరపీ చికిత్స తీసుకున్నప్పటికీ శరీరంలో 40%కి పైగా క్యాన్సర్‌ కణాలు ఉన్నాయి. అందువల్ల స్టెమ్స్‌ మార్పిడి అనేది ఫిర్త్‌కి అత్యంత ప్రమాదం అవుతుంది. దీంతో అతడు జీవించే అవకాశాలు మెల్లిమెల్లిగా తగ్గిపోవడం మొదలైంది.

చివరికి ఫిర్త్‌  జూలై 9, 2020న విషాదకర రీతిలో మరణించాడు. ఇలా ఫిర్త్‌లా చేజేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఇలా చెమటలు ఉన్నట్టుండి పడుతున్నా లేదా వాతావరణం చల్లగా ఉన్నా మీకు మాత్రం ఎడతెగని చెమటు పడుతున్నా.. అస్సలు అలక్ష్యం చేయొద్దని ఆరోగ్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఈ సూచనలు క్యాన్సర్‌ సంకేతాలు కూడా కావొచ్చనని, సాధ్యమైనంత వరకు బీ కేర్‌ఫుల్‌గా ఉండాలని నొక్కి చెబుతున్నారు వైద్యులు.

(చదవండి: మాంసం తినే పరాన్నజీవి ఓ మహిళను శాశ్వతంగా అంధురాలిని చేసింది!)

మరిన్ని వార్తలు