ఏమోయి? తెలుసునా మోయి మోయి!

10 Dec, 2023 04:17 IST|Sakshi

వైరల్‌

‘ఇంటర్‌నెట్టున ఏ నిమిషానికి ఏ ట్రెండు వచ్చునో ఎవరు ఊహించెదరు’ అని పాడుకోవాల్సిన టైమ్‌ ఇది. ప్రస్తుతం ‘మోయి మోయి’ అనేది వైరల్‌ ట్రెండ్‌గా మారింది.‘టిక్‌టాక్‌’లో వైరల్‌ అయిన సెర్బియన్‌ పాట నుంచి ఈ ట్రెండ్‌ వచ్చింది. ఈ ట్రెండ్‌లో భాగంగా రకరకాల మీమ్స్, పేరడీలు, రీల్స్‌ వస్తున్నాయి. ‘మోయి మోయి’కి సొంత డ్యాన్స్‌ను కూడా క్రియేట్‌ చేశారు.
సెర్బియన్‌ సింగర్‌–సాంగ్‌రైటర్‌ టెయా డోర ‘మోయి మోయి’ సాంగ్‌ యూట్యూబ్‌లో 60 మిలియన్‌ల వ్యూస్‌ సొంతం చేసుకుంది.

నిజానికి పాటలో ‘మోయి మోర్‌’ అని ఉంటుంది. అయితే మిస్టేక్‌ వల్ల‘మోర్‌’ కాస్త ‘మోయి’గా మారింది. తన పాట ట్రెండ్‌ కావడంతో టెయా డోర ఆనందంతో తబ్బిబ్బైపోతూ‘థ్రెడ్స్‌’లో ఇలా స్పందించింది... ‘సెర్బియన్‌ మ్యూజిక్‌ ప్రపంచవ్యాప్తం కావడం సంతోషంగా ఉంది. ప్రతిరోజూ ప్రపంచం నలుమూలల నుంచి అభినందన సందేశాలు వస్తున్నాయి. ఐ లవ్‌ యూ’ ‘మోయి మోయి’ ట్రెండ్‌ నేపథ్యంలో బాలీవుడ్‌ నటీమణులు ఉర్ఫీ జావెద్, డాలీ సింగ్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌ అయింది. ఈ వీడియోలో ఉర్వీ, డాలీసింగ్‌ల ‘మోయి మోయి’ డ్యాన్స్‌కు ప్రేక్షకులు ‘వావ్‌’ అంటున్నారు.

>
మరిన్ని వార్తలు