నటి పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి... కొంచెమైతే ఏమయ్యేదో..

23 Sep, 2021 16:54 IST|Sakshi

మన నిత్య జీవితంలో చేసే చిన్న చిన్న పొరబాట్లు పెద్ద పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయి. ఐతే ఆ టైంలో కొంచెం చురుకుగా వ్యవహరిస్తే పెనుప్రమాదం సంభవించకుండా నివారించవచ్చు. తాజాగా ఒక అమెరికా నటి పుట్టినరోజు వేడుకల్లో అటువంటి అపశ్రుతే చోటుచేసుకుంది. అయితే ఆమె సమయానికి స్పందించడంతో ప్రమాదం తప్పింది. అసలేంజరిగిందంటే.. 

‘ది సింపుల్‌ లైఫ్‌’ టెలివిజన్‌ సిరీస్‌లో నటించిన ప్రముఖ అమెరికన్‌ రియాలిటీ స్టార్‌ నికోల్‌ రిచీ తన 40వ పుట్టినరోజు వేడుకలను సెప్టెంబర్‌ 21న జరుపుకున్నారు. అయితే పుట్టిన రోజునాడు స్నేహితులతోపాటు కేక్‌ ముందు కూర్చుని కొవ్వొత్తులను నోటితో ఊది ఆర్పే టైంలో అనుకోకుండా ఆమె తలవెంట్రుకలకు రెండు వైపులా నిప్పు అంటుకుంది. ఆమెకు ఎడమవైపున కూర్చున్నవారు వెంటనే తేరుకుని మంటలను ఆర్పేశారు.

అయితే కుడి వైపున మాత్రం మంటలు చెలరేగాయి. ఆమె పెద్దగా అరుస్తూ తన చేతులతో ఆ మంటలను ఆర్పేశారు. కాగా ఈ వేడుకలకు కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఐతే ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. దీనికి సంబంధించిన వీడియోను నికోస్‌ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ‘వెల్‌ సోఫార్‌ 40 ఈజ్‌ (ఫైర్‌ ఎమోజీ)’ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే నెట్టింట వైరల్‌ అయ్యింది. 

దీంతో హ్యాపీ బర్త్‌డే కుజ్‌, మీరు బాగున్నారా? అని స్నేహితులు, అభిమానుల నుంచి వేలల్లో కామెంట్స్‌ రూపంలో కుశల ప్రశ్నల వర్షం కురిపించారు. లక్షల మంది ఈ వీడియోను ఆసక్తిగా వీక్షించడంతో సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసింది.

చదవండి: Typhoid Diet: టైఫాయిడ్‌ టైంలో ఇవి తినడం చాలా ప్రమాదకరం.. మరేం తినాలి?!

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు