Interesting Facts About Death: చనిపోయే ముందు వ్యకుల ప్రవర్తన ఇలానే ఉంటుందట..! నీడలను చూడటం..

25 Nov, 2021 17:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చనిపోయేముందు వ్యక్తుల ప్రవర్తన దాదాపుగా ఒకేలా ఉంటుందట.. అంతేకాదు ఓ మాటను పదేపదే ఉచ్చరిస్తారట కూడా. ఇంకా అనేక విషయాల గురించి అమెరికాలోని ఓ నర్సు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చకు దారితీస్తోంది.

జూలీకి దాదాపుగా 14 యేళ్లు నర్సుగా పనిచేసిన అనుభవం ఉంది. అందులో 9 యేళ్లు ఐసీయూ నర్సుగా పనిచేసింది. లాస్‌ ఏంజెల్స్‌, కాలిఫోర్నియాలలో కూడా 5 యేళ్లు నర్సుగా పనిచేసింది. అమె తన సర్వీసులో అనేక మంది మరణించడం చూసింది. ఐతే చనిపోయేముందు అనేక మంది ప్రవర్తన దాదాపుగా ఒకేలా ఉంటుందని జూలీ చెబుతోంది. ఇంకాసేపట్లో మరణించే అవకాశం ఉన్న వ్యక్తుల్లో అనేక మంది ఒకే విధమైన విషయం చెప్పడం గమనించిందట!


                                                                         జూలీ

మరణించేముందు శరీర రంగు మారడం, జ్వరం, తమకి అత్యంత ప్రియమైన వారి పేరును పదే పదే తలచుకోవడం చేస్తారట. ఎక్కువ మంది ‘ఐ లవ్‌ యూ’ అని అనడమో, గతంలో మరణించిన తల్లిదండ్రులకు ఫోన్‌ చేయడం వంటి పనులు చేస్తారట.

అంతేకాకుండా రోగుల్లో చాలా మంది చనిపోయే ముందు నీడలను చూడటం ప్రారంభిస్తారని పేర్కొంది. తమకి అత్యంత ప్రియమైన (అప్పటికే మరణించిన) వారి నీడలను చూడటం, ఇంటికి వస్తున్నానని చెప్పడం చేస్తారట. చాలా మందికి మరణం గురించి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు తనకు తెలుసని టిక్‌టాక్‌ ద్వారా ఓ వీడియోను ఆరు నెలల క్రితం పోస్ట్ చేసింది. కానీ సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. పుట్టిన వారందరూ ఏదో ఓ రోజు మరణించక తప్పదు. అయినా మరణం అంటే ఏమిటి? అది ఎలా ఉంటుందనే విషయాలపై కూడా ఆసక్తి చూపడం నిజంగా ఓ వింతే!

చదవండి: Coffee and Alzheimer's Disease: మతిమరుపుతో బాధపడుతున్నారా? కాఫీతో మీ బ్రెయిన్‌కు పదును పెట్టండి..

మరిన్ని వార్తలు