చిన్న పరికరంతో వెక్కిళ్లు మటుమాయం

11 Jul, 2021 15:18 IST|Sakshi

వెక్కిళ్లు వస్తే చాలా మంది నీళ్లు తాగుతారు. ఆగకుంటే.. నిమ్మకాయ, అల్లం ముక్క నమలడం వంటì చిట్కాలను పాటిస్తారు. అప్పుడు కూడా వెక్కిళ్లు తగ్గకుంటే ..?  వెంటనే ఈ ఎల్‌ షేప్‌ స్ట్రాతో నీళ్లను సిప్‌ చేయండి. చిటికలోనే వెక్కిళ్లన్నీ మాయం. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరికరాన్ని రూపొందించారు. పేరు ‘ద ఫోర్స్‌డ్‌ ఇన్‌స్పిరేటరీ సక్షన్‌ అండ్‌ స్వాలో టూల్‌’. చూడ్డానికి ఓ చిన్నపాటి గొట్టంలా కనిపిస్తుంది. ఓ వైపు మౌత్‌ పీస్, మరో వైపు ప్రెషర్‌ వాల్వ్‌తో ఉండే దీనిని సుమారు 249 మందిపై ప్రయోగించారు.

దీంతో నీటిని సిప్‌ చే స్తే దాదాపు 92 శాతం వెక్కిళ్లను నివారిస్తుందని వారి అధ్యయనంలో తేలింది. ఈ పరికరాన్ని ఇప్పుడు మార్కెట్‌లోకి అనుమతించింది ప్రభుత్వం. ప్రస్తుతం వివిధ కంపెనీల వారు, నీలం, ఆకుపచ్చ, బూడిద రంగుల్లో వీటిని తయారు చేస్తున్నారు. అయితే ధర రూ. వెయ్యి నుంచి రెండు వేలకు పైగా ఉంటుంది. ఆన్‌లైన్‌ మార్కెట్‌లోనూ లభ్యం.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు