మాతృత్వానికే మాయని మచ్చ..పసికందు ఏడుస్తుందని ఓ తల్లి..

9 Aug, 2023 16:31 IST|Sakshi

పక్షులు దగ్గర నుంచి చిన్న చిన్న కీటకాల వరకు తమ పిల్లల్ని కంటికి రెప్పలా కాచుకుని చూసుకుంటాయి. ఆఖరికి చిన్న కోడి సైతం తన పిల్లల జోలికి వస్తే పులి అయ్యిపోతుంది. అలాంటి ఓ మహాతల్లి పసిబిడ్డ పట్ల వ్యవహరించిని తీరు చూస్తే గగుర్పాటుకు గురవ్వుతారు. ఆమె అసలు తల్లేనా? అన్నంతగా సీరియస్‌ అవుతారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. 

అసలేం జరిగిందంటే..అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ మహిళ తన బిడ్డను తీసుకుని ఆస్పత్రికి వచ్చింది. బిడ్డ ఉలుకుపలుకు లేకుండా శవం మాదిరిగా పడుకుని ఉండటంతో వైద్యులు ఒక్కసారిగా భయపడ్డారు. కానీ ఆ తల్లి నార్మల్‌గా ఉంది. ఎలాంటి భయాందోళన లేకుండా పసిబిడ్డకు కొంచెం ఒంట్లో నలతగా ఉందని ట్రీట్‌మెంట్‌ చేయమని చెప్పి మరీ  వైద్యులకు ఇచ్చింది.

దీంతో అనుమానం వచ్చి డాక్టర్లు ఆ పసికందుని పరీక్షించగా ఆల్కహాల్‌ పట్టించినట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా వైద్యలు నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కన్న బిడ్డకే మద్యం ఇచ్చి చంపాలన చూసిందని ఆరోపణలు చేశారు. సదరు మహిళ హోనెస్టి డీ లా టోర్రేగా గుర్తించారు. ఆ మహిళ రియాల్టో గుండా ‍డ్రైవింగ్‌ చేస్తుండా పాప ఏడుస్తుందని మద్య పట్టించినట్లు పేర్కొంది.

పైగా మద్యం ఇవ్వడంతో ఏడుపు ఆపేసిందని చెబుతోంది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అయితే  పసికందు పరిస్థితి ఎలా ఉందనేది వైద్యులు బయటకు తెలిజేయలేదు. ఏదిఏమైనా ఇంత ఘోరమైన తల్లులు కూడా ఉన్నారా! అనిపిస్తోంది కదూ.

(చదవండి: ఇష్టం అంటే మరీ ఇలానా! ఈ స్ట్రేంజ్‌ అడిక్షన్‌ వింటే షాకవ్వాల్సిందే!)

మరిన్ని వార్తలు