మార్నింగ్‌ వాక్‌కి వెళ్లింది... కోటీశ్వరురాలైంది!!

19 Oct, 2021 14:31 IST|Sakshi

అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో తలుపుతడుతుందో చెప్పలేం! ఒక్కొసారి వారి జీవితం అనూహ్య మలుపు తిరగడం కూడా జరుగుతుంది. అలాంటి అనూహ్య సంఘటనే జరిగింది. ఎప్పటిలాగే మార్నింగ్‌ వాక్‌కి వెళ్లిన ఓ మహిళకు అదృష్టం 4 క్యారెట్ల డైమండ్‌ రూపంలో కలిసిసొచ్చింది. అసలేంజరిగిందంటే..

అమెరికాలోని కాలిఫోర్నియాకి చెందిన నొరీన్‌ రిడ్‌ బెర్గ్‌ అనే మహిళ ప్రతిరోజూ మాదిరిగానే సమీపంలోని అర్కన్‌సాస్‌ స్టేట్‌ పార్క్‌కు మార్నింగ్‌ వాక్‌కు వెళ్లింది. సడెన్‌గా ఆమెకు పసుపు రంగులో ఉన్న 4.38 క్యారెట్‌ డైమండ్‌ దొరికింది. ఆ వజ్రం విలువ దాదాపు 2 వేల నుంచి 20,000 డాలర్లు (సుమారు రూ. 15 లక్షలు) ఉంటుందట. పసుపు రంగులో తళతళ మెరిసిపోతున్న డైమండ్‌ ఆమె జీవితాన్ని అనూహ్యమలుపు తిప్పింది. 1972 తర్వాత ఇటువంటి డైమండ్‌ మళ్లీ ఇన్నాళ్లకి దొరికిందని పార్క్‌ నిర్వాహకులు తెలిపారు. 1972 నుంచి ఇప్పటివరకు దాదాపుగా 75 వేల డైమాండ్లు దొరికాయట. ఈ యేడాది 258 వజ్రాలు అక్కడి ప్రజలకు దొరికాయని స్థానిక మీడియా తెల్పింది. ఈ పార్కును సందర్శించే వారికి రోజుకు కనీసం ఒకటి రెండైన వజ్రాలు దొరకుతాయట.

చదవండి: డ్రీమ్‌ హౌస్‌ షిఫ్టింగ్‌.. సముద్రంపై పడవలతో గమ్యానికి చేర్చి..! 

కాగా ప్రపంచవ్యాప్తంగా అర్కన్‌సాస్‌ స్టేట్‌ పార్క్‌ డైమండ్లకు ఫేమస్‌. ఈ పార్క్‌ ఉన్న ప్రదేశంలో అగ్నిపర్వతం నుంచి పైకి ఉబికి వచ్చిన శిలాద్రవం అంతా విస్తరించి ఉంటుంది.అందువల్ల ఈ పబ్లిక్‌ పార్కులో తరచుగా విలువైన వజ్రాలు దొకుతాయట. ఇక్కడ ఎవరైనా డైమండ్ల కోసం వెతకొచ్చట. అంతేకాకుండా దొరికిన డైమండ్‌ వాళ్లదగ్గరే ఉంచుకోవచ్చు లేదా అమ్ముకొవచ్చు. ప్రపంచంలోనే వజ్రాలు దొరికే ఏకైక పబ్లిక్‌ పార్క్‌ ఇదేనట..!!

చదవండి: టీవీ చూస్తూ.. హాయిగా నిద్రపోతే చాలు.. నెల జీతం రూ.25 లక్షలు!!

మరిన్ని వార్తలు