Health Tips: ద్రాక్ష రసాన్ని కొంచెం తేనెలో కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే

18 Feb, 2023 03:20 IST|Sakshi

ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు మూడు వెల్లుల్లి రేకులు తింటే రక్తపోటు, కడుపులో మంట, నులిపురుగుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
♦ కొన్ని స్పాంజి ముక్కలను నీళ్ళలో తడిపి ఫ్రీజర్లో ఉంచండి. చెయ్యి కాలినా లేదా ఏ తలుపు సందులోనో పడి నలిగినా ఒక స్పాంజి ముక్కను తీసి బాధ ఉన్న ప్రదేశంలో కొద్దిసేపు ఉంచితే నొప్పి, వాపు వెంటనే తగ్గుతాయి.
♦ పళ్ళు వచ్చే ముందు పిల్లలు ప్రతిదాన్నీ కొరుకుతూ చిగుళ్ళు నొప్పి పుట్టి ఏడుస్తూ ఉంటారు. అటువంటప్పుడు సారింజ తొనలలోని విత్తనాలు తీసేసి, ఆ తొనలను కాసేపు ఫ్రిజ్లో ఉంచి వాటిని పిల్లలకు ఇస్తే ఆ చల్లదనం వారి బాధను పోగొట్టి రిలీఫ్‌ ఇస్తుంది. వారికి అవసరమైన ‘సి’ విటమిన్‌ కూడా లభిస్తుంది.
♦ ద్రాక్ష రసాన్ని కొంచెం తేనెలో కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.
♦ కొబ్బరినూనె, నిమ్మరసం సమపాళ్ళలో తీసుకుని బాగా కలిపి కొద్దిగా వేడిచేసి నొప్పిగా ఉన్న ప్రాంతం లో మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
♦ కిడ్నీ వ్యాధుల నివారణకు రెండు వంతుల దోసకాయ రసానికి, ఒక వంతు ద్రాక్ష రసాన్ని కలిపి ఉదయం, సాయంత్రం ఒక కప్పు చొప్పున తాగి చూడండి
♦ బచ్చలి రసం, అనాసరసం సమపా ళ్లలో తీసుకుని దానిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది.

మరిన్ని వార్తలు