Health Tips: గుమ్మడి గింజలు తింటున్నారా?; కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి విముక్తికై!

12 Jan, 2023 15:04 IST|Sakshi

Health Tips In Telugu: గుమ్మడి గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

ఫ్యాటీ ఫిష్‌ తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చేపలలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి గుండెను ఫిట్‌గా ఉంచుతాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.

కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి విముక్తికై!
►అరకప్పు పెరుగులో చెంచా నిమ్మరసం, అరస్పూను ఉప్పు వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
►తులసి ఆకుల రసాన్ని తీసి దానికి ఒక చెంచా తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

మరిన్ని ఆరోగ్య చిట్కాలు
►పుదీనా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారంలో ఫ్యాట్‌ ఎక్కువుగా ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో పుదీనా తీసుకుంటే అజీర్తి సమస్య ఉండదు.
►పైత్యం, ఆ కారణంగా తలతిప్పటం వంటి సమస్యలున్నప్పుడు జీలకర్రను మెత్తగా గ్రైండ్‌ చేసి ఆ పేస్ట్‌ను నీటిలో కలిపి తాగాలి. ఇలా రెండు రోజుల పాటు రోజుకు రెండుసార్లు చేయాలి.

►పొట్టకి సంబంధించిన పలు సమస్యలకు వెల్లుల్లి మంచి మందు, ఒకటి రెండు రెబ్బల వెల్లుల్లిని మెత్తగా నూరి ఆ రసాన్ని అరకప్పు నీటిలో కలిపి తాగడం వల్ల అరుగుదల సమస్య దూరం అవుతుంది. దాంతోపాటు పొట్టలో పురుగులు, శరీరంలోని విషపదార్ధాలు నశిస్తాయి. కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంటుంది. 
నోట్‌: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం పొందే అవకాశం ఉంటుంది.

చదవండి: వేలెడంత సైజు.. వండుకుని తింటే.. ఆ టెస్టే వేరు!
Sia: ఇకపై పాత చెప్పులు, షూస్‌ పారేసే ముందు ఒక్కసారి ఆలోచించండి! మీ వల్ల ఎంతో మందికి..

మరిన్ని వార్తలు