Best Health Tips In Telugu: ఈ చిట్కాలతో ఆరోగ్యం, అందం కూడా! రోజూ కోడిగుడ్డు తింటే..

23 Apr, 2022 13:21 IST|Sakshi

కొంతమంది ఉడకబెట్టిన కోడిగుడ్డు తినేందుకు ఇష్టపడరు. అలాంటి వారు దాని ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అస్సలు వదలరు. గుడ్డులోని తెల్లసొనను తినడం వల్ల అధిక రక్తపోటును నియంత్రించుకోవచ్చు. గుడ్డు తినడం అన్ని రకాల గుండె సమస్యలను దూరం చేస్తుంది. అందువల్ల మీరు రోజూ తినే ఆహారంలో గుడ్డును చేర్చుకోవడం చాలా మంచిది. 

మరిన్ని ఆరోగ్య చిట్కాలు
మెడ నొప్పితో బాధపడుతున్నారా?
నిద్ర లేచిన తర్వాత మీకు మెడ నొప్పిగా అనిపిస్తే.. నొప్పి ప్రభావిత ప్రాంతాల్లో ఐస్‌ ప్యాక్‌ లేదా చల్లని నీటిలో క్లాత్‌ను ముంచి నీళ్లు పిండేసి మెడమీద మెల్లగా అద్దాలి. అలా చేయడం వల్ల మెడ కండరాల వాపు తగ్గుతుంది. దీంతో పాటు హీట్‌ ప్యాక్‌ ను ఉపయోగించవచ్చు.  

మెడ నొప్పిగా ఉన్న వాళ్లు చేతులతో మెడను నెమ్మదిగా మసాజ్‌ చేయాలి. అలా చేయడం వల్ల కండరాలు సర్దుకొని నొప్పి తగ్గే అవకాశం ఉంది. మసాజ్‌ చేసే సమయంలో కొబ్బరి లేదా నువ్వుల నూనె ఉపయోగిస్తే మేలు. ఒకోసారి నిద్రలో కూడా మెడ పట్టేస్తుంటుంది. ఇందుకోసం మీరు రాత్రిళ్లు బోర్లా పడుకోకుండా ఉంటే చాలు. 

చుండ్రు పోవాలంటే..
బాదం నూనెలో నిమ్మరసం కలిపి రాసుకుంటే చుండ్రు పోతుంది. ఒక గిన్నెలో కొద్దిగా బాదం నూనెను తీసుకొని.. అందులో కాస్త నిమ్మ రసాన్ని మిక్స్‌ చేసి.. ఆ తర్వాత జుట్టుకు పట్టించాలి. ఇది మాడుకు పట్టేట్లుగా కొద్దిసేపు చేతులతో తలపై మృదువుగా మసాజ్‌ చేయాలి. మసాజ్‌ చేసిన తర్వాత అవసరమైతే.. గంట తర్వాత లేదా మరుసటి రోజు షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది.  

చదవండి: Beauty Tips: ముఖంపై మంగు మచ్చలు ఉంటే.. పాలల్లో ఎర్రకందిపప్పు నూరి నేతిలో కలిపి..

మరిన్ని వార్తలు