Hemkund Sahib: హిమాలయాల్లో చివరి నివాస ప్రదేశం ఇదే!

18 Sep, 2021 11:45 IST|Sakshi

హిమకుండ్‌ కోనతీర్థం

Travel Tips In Telugu: హిమకుండ్‌ సాహిబ్‌... ఇది సిక్కుల పవిత్రతీర్థం. సిక్కుల పదవ గురువు ‘గురు గోవింద్‌ సింగ్‌’ ధ్యానం చేసుకున్న ప్రదేశం. హిమకుండ్‌ అంటే మంచుసరస్సు. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో, సముద్ర మట్టానికి 4,329 మీటర్ల ఎత్తున ఉంది ఈ ప్రదేశం.

ఇక మంచు టోపీలు పెట్టుకున్న పర్వత శిఖరాలు చూపరులను కట్టి పడేస్తాయి. ఇక్కడ గురుద్వారా, లక్ష్మణునికి ఆలయం ఉన్నాయి. సిక్కులు ఈ పవిత్ర తీర్థంలో మునిగి ఇక్కడ ఉన్న గురుద్వారాని దర్శించుకుంటారు.

ఆసక్తికర అంశాలు
హిమకుండ్‌ సాహిబ్‌ టూర్‌లో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ను కూడా కలుపుకోవచ్చు. 
ఘంఘారియా ప్రత్యేకతను కూడా తెలుసుకుని మరీ ఇక్కడ పర్యటన కొనసాగించాలి.
ఇది పుష్పావతి, హిమగంగ నదుల కలయిక ప్రదేశం. హిమాలయాల్లో చివరి నివాస ప్రదేశం కూడా.
డిసెంబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకు ఈ ప్రదేశం మంచుదుప్పటి కప్పుకుని ఉంటుంది.
ట్రెకింగ్‌కి మే నెల నుంచి అక్టోబర్‌ వరకు అనుమతిస్తారు. 


చదవండి: Beauty Tips In Telugu: నల్లని కురులకు.. బ్లాక్‌ జీరా ప్యాక్‌!

మరిన్ని వార్తలు