H3N2 Virus: ఈ వైరస్‌ అంత డేంజరా? ఇలా చేశారంటే మాత్రం..

9 Mar, 2023 18:25 IST|Sakshi

భయపెట్టే ప్రచారం, భయపడితే ఆపాయం

ఏంటీ H3N2 వైరస్ ? ఇది వందేళ్ల నాటి వైరస్. H1N1 వైరస్. మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి వైరస్. ఇప్పుడు కొత్తగా మ్యుటేట్ అయ్యిందా ? లేదు.. ప్రతి సంవత్సరం అనేక సార్లు మ్యుటేట్ అయ్యింది.

ఇప్పుడు కొత్తగా సోకుతోందా? ప్రతి ఒక్కరికి అనేక సార్లు సోకింది. మరి ఇప్పుడు కొత్తగా భయపెడుతున్నారేంటి ? గతంలో మాస్క్లు లేవు. మ్యుటెంట్లకు కొత్త పేర్లు పెట్టి భయపెట్టి బిజినెస్ చేయడం గతంలో లేదు. ఇప్పుడు భయమే ఫార్మా కంపెనీల బిజినెస్. కోవిడ్‌ రెండో వేవ్లో గల్లా పెట్టెలు దాటి గోడౌన్లు నోట్ల కట్టలతో నిండాయి. ఓమిక్రాన్ వేవ్ వారిని నిరాశ పరిచింది.

వాక్సీన్‌ల పుణ్యమా అంటూ సైడ్ ఎఫెక్ట్స్ వారు చికిత్స కోసం వెళుతుంటే బిజినెస్ బాగానే సాగుతోంది ! తిరిగి మాస్క్ లు నిభందనలు అలెర్ట్ అంటూ జనాల్లో భయం నింపి బిజినెస్ చేయాలనే ప్రయత్నం. గతం కంటే ఇప్పుడు ఇది ఎక్కువ ప్రభావం చూపుతోంది ఎందుకని ? రెండేళ్లు మాస్క్లు పెట్టుకొని వాక్సీన్లు వేసుకొని ఇమ్మ్యూనిటి ని బలహీనం చేసుకొన్నారు.

ఇదే కారణం. మరి ఇప్పుడేమి చెయ్యాలి? దొంగలు దూరిన ఆరు నెలలలకు అన్నట్టు వున్నాయి కొందరి కూతలు. ఇది జనవరిలోనే మొదలయ్యింది. లక్షలాది మంది దీని బారిన పడి కోలుకున్నారు. దగ్గు రెండు మూడు వారాలు కొనసాగి తగ్గి పోయింది. ఇక ఎవరికీ రాదా? ఎవరో కొంతమందికి . రెండు నెలల్లో సోకకుండా మిగిలి పోయిన వారికి సోకుతుంది.

మరి ఏమి చేయాలి?
డి ,సి, బి విటమిన్ టాబ్లెట్స్ నాలుగు రోజులు( సోకినప్పుడు మాత్రం ) జింక్ టాబ్లెట్, వేడి నీరు తాగడం, వేడి నీటిలో ఉప్పు వేసి నోట్లో పోసుకొని పుకిలించడం, పసుపు అల్లం కాషాయం టీ కప్పులో మూడు నాలుగు రోజులు వేసుకోవడం.

తగినంత నీరు తాగడం. రెండు రోజులు రెస్ట్. పాత రోగానికి కొత్త మోత వద్దు. కొందరి విష ప్రచారానికి మోసపోవద్దు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరి!


-వాసిరెడ్డి అమర్‌నాథ్‌, పాఠశాల విద్యానిపుణులు, మానసిక శాస్త్ర నిపుణులు
(నోట్‌: ఇది వ్యాసకర్త వ్యక్తిగతానుభవసారం ఇచ్చిన కథనం)

చదవండి: తీవ్ర లక్షణాలా? కరోనా కాదు.. యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడొద్దు!

మరిన్ని వార్తలు