Video: ఆరోగ్య లాభాలనిచ్చే పైనాపిల్‌.. తొక్క ఇలా ఈజీగా ఒలిచేయండి!

24 May, 2022 17:19 IST|Sakshi

పైనాపిల్‌.. ముఖ్యంగా జ్యూస్‌ను చాలా మంది ఇష్టపడతారు. రుచితో పాటు ఈ పండు కలిగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలే ఇందుకు కారణం. పైనాపిల్‌లో విటమిన్‌ బీ, సీతో పాటు పీచు పదార్థం పుష్కలం. శరీరానికి కావాల్సిన ఖనిజ లవణాలు కూడా అందిస్తుంది. 

ఆహారం జీర్ణమవడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు బరువును తగ్గించడంలోనూ ఇది ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్న మాట. ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయి కాబట్టే స్మూతీలు, జ్యూస్‌, ఫ్రూట్‌సలాడ్‌.. ఇలా వివిధ రూపాల్లో పైనాపిల్‌ తీసుకుంటూ ఉంటారు. అంతా బాగానే ఉంది కానీ.. ముళ్లు ముళ్లుగా ఉండే దీని తొక్క తీయాలంటేనే కాస్త కష్టం.

అయితే, దీని గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదని, సులభ పద్ధతిలో పైనాపిల్‌ తొక్క తీసే విధానాన్ని చూపిస్తానంటున్నారు సెలబ్రిటీ చెఫ్‌ కునాల్‌ కపూర్‌. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్‌ చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి మీరు కూడా ఈజీగా పైనాపిల్‌ తొక్క ఒలిచేయండి!

A post shared by Kunal Kapur (@chefkunal)

చదవండి👇
Healthy Heart Tips: ఈ ఆహార పదార్థాలు తినడం అలవాటా.. అయితే ప్రమాదం పొంచిఉన్నట్లే!
Healthy Heart Diet: 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు, బచ్చలి కూర తిన్నారంటే!
 

మరిన్ని వార్తలు