అరటి ఆకులతో హల్వా ట్రై చేశారా?

2 Apr, 2024 12:05 IST|Sakshi

హల్వా అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అలాంటి హల్వాని సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా వివిధ పండ్లతో, కూరగాయాలతో చేయటం చూశాం. ఎన్నో రకాల మేళవింపులతో కూడిన హల్వాలను రుచి చూశాం. అయితే ఇలా ఆకులతో చేసే హల్వాని మాత్రం చూసి ఉండరు. అందులోనూ అరటి ఆకులతో చేయడం గురించి విన్నారు. ఎలా చేస్తారంటే..అత్యంత ప్రజాధరణ పొందిన స్వీట్సలో హల్వా ఒకటి. దాని రుచే అదిరిపోతుంది. అలాంటి హల్వాని ఆకులతో చేయడం ఏంట్రాబాబు అనుకుంటున్నారా..!.

అందుకు సంబంధించిన ఆసక్తికర వీడియో ఒకటి నెట్టింట చక్కెర్లు కొడుతోంది. అందులో ఓక వ్యక్తి ఈ వైరైటీ హల్వాని చేసి చూపించాడు. అతను అరటి ఆకులను చక్కగా శుభ్రం చేసి మద్యలోని కాండాన్ని తొలగించాడు. ఆ తర్వాత ఆకులన్నింటిని చక్కగా చదును చేసి రోల్‌ చేశాడు. ఇక దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేశాడు. వాటన్నింటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసి జ్యూస్‌లా. ఆ తర్వా స్టవ్‌పై కడాయి పెట్టి నెయ్యి వేసి, అందులో ఈ జ్యూస్‌ని వేసి పచ్చి వాసన పోయి దగ్గర పడేలా మరిగించాడు.

ఆ తర్వాత పంచాదర కలిపి మరింత దగ్గర పడేలా చేశాడు. ఈలోగా కార్న్‌ఫ్లోర్‌ని చక్కగా నీటిలో కలిపి పేస్ట్‌ చేసుకున్న మిశ్రమాన్ని ఈ మిశ్రమంలో కలపాడు. ఇకి హల్వాల దగ్గర పడుతుందనంగా డ్రైఫ్రూట్స్‌తో అలంకరించాడు. చివరిగా ఆ హల్వాని టేస్ట్‌ చేసి వ్యక్తి పైకి బాగుందని అన్నా..అతని ఎక్స్‌ప్రెషన్స్‌ మాత్రం బాలేదన్నట్లు ఇబ్బందికరంగా ఉన్నాయి. దీంతో నెటిజన్లు బాస్‌ ఏంటి చెత్త ప్రయోగాలు..బాగుందంటూ హవభావాలు వేరేలా ఉన్నయేంటీ అని చివాట్లు పెడుతూ పోస్టులు పెట్టారు. 

A post shared by Great Indian Asmr (@great_indian_asmr)

(చదవండి: మహారాజ్‌ ప్యాలెస్‌లో ఆహరం వడ్డించే విధానం ఇలా ఉంటుందా!)

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers