డ్రీమ్‌ హౌస్‌ షిఫ్టింగ్‌.. సముద్రంపై పడవలతో గమ్యానికి చేర్చి..! 

18 Oct, 2021 17:01 IST|Sakshi

డ్రీమ్‌ హౌస్‌ను కూల్చేసే పరిస్థితొస్తే మీరైతే ఏం చేస్తారు? గుండె రాయి చేసుకుని వేరే ఇంటికి మారిపోతారు. కానీ ఈ జంట మాత్రం ఆరునూరైనా సరే తమ ఇళ్లు కూల్చడానికి వీల్లేదనుకున్నారు. పడవలపై సముద్రం దాటించిమరీ వేరే చోటుకి తమ కలల ఇల్లుని షిఫ్ట్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించని వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

లండన్‌లోని న్యూఫౌండ్‌ల్యాండ్‌కి చెందిన డానియేలి పెన్నీ రెండు అంతస్థుల ఇంటిని ద్వీపకల్పంలో కట్టుకుంది. చుట్లూ అందమైన పర్వతాలతో ఆహ్లాదకర వాతావరణంలో ఆనందంగా గడుపుతున్న సమయంలో యజమాని ఇంటిని కూల్చివేస్తున్నాడనే పెనువార్త తెలిసింది. దీంతో పెన్నీ, ఆమె భర్త కిర్క్‌ లోవెల్‌ ఒక పథకం ప్రకారం ఇంటిని అక్కడి నుంచి షిఫ్ట్‌ చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇంటిని ఒక మెటల్ ఫ్రేమ్‌పై అమర్చారు. తర్వాత టైర్లు కట్టి, రెండు చిన్న పడవల సహాయంతో సముద్రం దాటించి గమ్యస్థానానికి తీసుకెళ్లారు. ఇది అంత సులువుగా జరగలేదట. సముద్రం దాటించేటప్పుడు మధ్యలో ఒక పడవ విరిగిపోవడంతో ఇళ్లు నీళ్లలో మునగడం ప్రారంభించింది. ఇళ్లు ఇక దక్కదని ఆశలు వదులుకున్నారు. ఎట్టకేలకు ఇంటిని ఒక ముక్కగా అమర్చి 8 గంటల్లో వేరో చోటికి మార్చగలిగామని అక్కడి స్థానిక మీడియాకు తెలియజేశారు. ఇంటిపై మమకారం వారిని ఇంత సాహసానికి పురిగొల్పింది.!

చదవండి: ఢిల్లీలో హఠాత్తుగా పెరిగిన వాయుకాలుష్యం.. కారణం అదే!

>
మరిన్ని వార్తలు