రెండే రెండు నిమిషాల్లో బాద్‌షా సాంగ్‌, స్పందించిన ర్యాపర్‌

14 Jan, 2022 14:59 IST|Sakshi

హ్యూమర్‌ అంటే ఇష్టం లేనిది ఎవరికి? ఆ మాటకొస్తే మ్యూజిక్‌ అంటే కూడా! ఈ రెండిటినీ మిక్స్‌ చేస్తే ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుందిగానీ, ఆ కళ కాస్త గట్టిగా తెలిసుండాలి. సరిగ్గా ఈ కోవకు చెందిన మ్యూజిషియన్‌ అన్ష్‌మన్‌ శర్మ. ‘హౌ టూ మేక్‌ ఏ బాద్‌షా సాంగ్‌ ఇన్‌ 2 మినిట్స్‌’ పేరుతో ఆయన ఒక వీడియో రూపొందించాడు. సాంగ్‌ మేకింగ్‌ గురించి ఎనిమిది స్టెప్స్‌తో జనవరి 10న పోస్టు చేసిన ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఇప్పటి వరకు 9 లక్షల పైనా వ్యూవ్స్‌ వచ్చాయి. ఇలాంటి వీడియోనే గతంలో రిత్విక్, ప్రతీక్‌ పాటల గురించి చేసి శబ్భాష్‌ అనిపించుకున్నాడు శర్మ.  అయితే ఈ వైరల్ వీడియో చివరికి రాపర్ దృష్టిని ఆకర్షించింది. దీనిపై స్పందిస్తూ ‘అతను దాదాపు కొల్లగొట్టాడని ప్రమాణం చేస్తున్నాను" అంటూ బాద్‌షా నవ్వుతున్న ఎమోజీ షేర్‌ చేశారు.

మరిన్ని వార్తలు