ఈ విటమిన్‌తో బ్లాడర్‌ క్యాన్సర్లకు చెక్‌

29 Mar, 2021 22:16 IST|Sakshi

విటమిన్‌ ‘ఈ’ ఉన్న ఆహారాలు తీసుకోవడం ద్వారా మూత్రాశయ (బ్లాడర్‌) క్యాన్సర్ల నివారణ జరుగుతుందన్నది కొన్ని అధ్యయనాల ద్వారా కచ్చితంగా తెలియవచ్చిన వాస్తవం. ఉదాహరణకు... యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సస్‌లోని యాండర్సన్‌ క్యాన్సర్‌ సెంటర్‌లో నిర్వహించిన అధ్యయనాల్లో  విటమిన్‌–ఈ లోని ఆల్ఫాటోకోఫెరాల్‌ అనే రసాయనం... బ్లాడర్‌ క్యాన్సర్‌ను సమర్థంగా నివారిస్తుందని తేలింది. మనం తీసుకునే ఆహారపదార్థాల్లో మిరియాలు, పాలకూర, బాదంలతో పాటు పొద్దుతిరుగుడునూనె, కుసుమ నూనెలోనూ విటమిన్‌–ఈ పాళ్లు ఎక్కువ. అలాగే  క్రూసిఫెరస్‌ వెజిటబుల్స్‌గా పేర్కొనే... క్యాబేజీ, బ్రకోలీ, కాలీఫ్లవర్‌ వంటివి కూడా మూత్రాశయ (బ్లాడర్‌) క్యాన్సర్‌ను సమర్థంగా నివారిస్తాయని తేలింది. అందుకే మీ డైట్‌లో ఈ ఆహారాలు ఉండేలా చూసుకోండి. మూత్రాశయ (బ్లాడర్‌) క్యాన్సర్లను నివారించుకోండి. 

మరిన్ని వార్తలు