Winter Skin Care Tips: చర్మ సమస్యలా? బాదం, పాలకూర, అవకాడో.. ఇవి తిన్నారంటే..

5 Nov, 2021 11:08 IST|Sakshi

శీతాకాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా పొడి చర్మం, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ కాలంలో జుట్టు, చర్మానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తప్పక తీసుకోవాలి. సాధారణంగా చర్మ సౌందర్య ఉత్పత్తుల్లో విటమిన్‌ ‘ఇ’నూనెలు వాడుతారు. ఐతే ఈ నూనెల్లో ఇతర కెమకల్స్‌ కూడా ఉంటాయి. సహజ పద్ధతుల్లో శరీరానికి ఈ విటమిన్‌ అందాలంటే..  విటమిన్‌ ‘ఇ’ అధికంగా ఉండే ఆహారాన్నితీసుకోవడం ఉత్తమ పద్ధతి. 

విటమిన్‌ ‘ఇ’తో ఎన్నో ప్రయోజనాలు
ఈ విటమిన్‌ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, చర్మ సమస్యల నుంచి రక్షణ కల్పించే లక్షణాలు కలిగి ఉంటుంది. అంతేకాకుండా వృద్ధాప్యఛాయలు, ఎండవల్ల  కమిలిన చర్మానికి చికిత్సనందిస్తుంది. ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ ను నిరోధించి ఇమ్యునిటీని పెంచడంతోపాటు చర్మ, కేశ ఆరోగ్యాన్నిపెంపొందిస్తుంది. విటమిన్‌ ‘ఇ’ అధికంగా ఉండే కొన్ని రకాల ఆహారాలను ప్రముఖ రేడియాలజిస్ట్‌ డా. మనోజ్‌ అహుజా సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

బాదం
రాత్రి అంతా నానబెట్టిన ఐదు బాదం పప్పులను ఉదయాన్నే పరగడుపున తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకున్నా మంచిదేనని తరచుగా చెబుతారు ఎందుకంటే బాదంలో విటమిన్‌ ‘ఇ’ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. దీనిలో ఇతర పోషకాలు కూడా నిండుగా ఉంటాయి.

చదవండి: ఈ సబ్బు ఖరీదు తెలిస్తే మూర్చపోతారు!.. రూ. 2.7 లక్షలట!!

పాలకూర
ఉదయం పూట అల్పాహారంగా ఆకు పచ్చ కూరగాయలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉడికించిన గుడ్డుతో లేదా తరిగిన పాలకూర ఆకులను గుడ్డులో కలిపి ఆమ్లేట్‌లా చేసుకుని తిన్నా మీ శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. పాలకూరతో రావియోలి కూడా తయారు చేసుకోవచ్చు లేదా పాలకూర, పనీర్‌లను శాండ్‌విచ్‌లో స్టఫ్ గా కూడా వాడొచ్చు.

అవకాడో పండు
అవకాడో పండు మెత్తగా క్రీమీగా ఉంటుంది. దీనిని టోస్ట్‌ లేదా గుడ్డు, మాంసం, కూరగాయలు దేనితోనైనా ఈ పండును మెత్తగా స్మాష్‌ చేసి కలుపుకుని బ్రెడ్‌లో స్టఫ్‌గా తినొచ్చు. 

చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్‌ మైనింగ్‌! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట!

పొద్దుతిరుగుడు విత్తనాలు 
పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ ‘ఇ ’ పుష్కలంగా ఉంటుంది. కాల్చిన పొద్దుతిరుగుడు గింజలను మార్నింగ్‌ కాఫీతో స్నాక్స్‌లా తినొచ్చు. లేదా ఓట్స్‌, పాన్‌ కేక్‌ వంటి ఇతర భోజనాలపై ఈ విత్తనాలను చల్లుకుని తినొచ్చు.

వేరుశెనగ 
బ్రెడ్‌పై వేరుశెనగ వెన్న పూసి ఉదయం అల్పాహారంగా తినొచ్చు. ఉప్మా, పోహాలలో వేరుశెనగను జోడించి తిన్నా మంచిదేనని డా. మనోజ్‌ అహుజా సూచిస్తున్నారు.

చదవండి: Lake of No Return: ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్‌..

మరిన్ని వార్తలు