నమస్కారం అంటే..ఏదో యాంత్రికంగా చేసేది కాదు! ఎక్కడ? ఎలా? చేయాలో తెలుసుండాలి!

4 Dec, 2023 09:38 IST|Sakshi

గురువు గారికి తిరిగి ప్రత్యుపకారం చేస్తాను... అనడం సాధ్యమయ్యే విషయం కాదు. గురువు విషయంలో చేయగలిగినది ఏమిటి.. అంటే ...‘జలజాతేక్షణు? దోడితెచ్చితివి నా సందేశముం జెప్పి; నన్‌/నిలువం బెట్టితి; నీ కృపన్‌ బ్రతికితిన్‌ నీ యంత పుణ్యాత్మకుల్‌/గలరే; దీనికి నీకు? బ్రత్యుపకృతిం గావింప నే నేర; నం/జలిం గావించెద; భూసురాన్వయమణీ! సద్బంధుచింతామణీ!‘ అంటుంది రుక్మిణీ దేవి భాగవతంలో. అంతటి ఉపకారం చేసిన నీకు ప్రత్యుపకారం నేనేం చేయగలను.. అంజలి ఘటించడం తప్ప... అంటుంది. అంటే రెండు చేతులు కలిపి జోడించి శిరస్సు తాటించి నమస్కరించడం.

ఈ ఐదు వేళ్ళతో కూడుకున్న చెయ్యి–కర్మేంద్రియ సంఘాతం. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు పదింటిని, బుద్ధిస్ధానమయిన 11వదయిన శిరస్సును కలిపి మీ పాదాల దగ్గర న్యాసం చేస్తున్నాను... అని చెప్పడానికి నమస్కారం చేస్తారు. ఈ తలలో వచ్చిన ఎన్నో ఆలోచనలను, ఈ చేతులతో ఎన్నో చేయకూడని పనులను చేసి మనుష్య జన్మ పాడుచేసుకున్నా. మీ వాక్కులు అగ్నిహోత్రం. నాలో ఉన్న అజ్ఞానాన్ని దహించి నేను ప్రయాణించాల్సిన మార్గాన్ని చూపించి నన్ను రక్షించండి... అని చెప్పడానికి అంజలి ఘటిస్తారు. అంతటి గొప్పరూపం గురువు.

సనాతన ధర్మంలో భగవంతుడే గురువుగా కూడా ఉంటాడు. గురువు ఒకడు, భగవంతుడు ఒకడు కాదు. నిజానికి భగవంతుడే గురువు. శైవసంప్రదాయంలో దక్షిణామూర్తి చాలా చాలా గొప్ప గురువు. ఆయన నోటితో మాట్లాడకుండా చిన్ముద్రపట్టి కూర్చున్నాడు. ఆయన గురువు. అలాగే వైష్ణవ సంప్రదాయంలో శ్రీకృష్ణపరమాత్మ జగద్గురువు.‘కృష్ణం వందే జగద్గురుమ్‌!’. అమ్మవారు గురు మండల రూపిణి. సమస్త గురుమండల రూపిణి జగన్మాతయే. భగవంతుడు ఏ అవతారంలో మనముందుకొచ్చినా గురువుపట్ల అమిత గౌరవంతో ప్రవర్తిస్తాడు.

16 గుణాలు పరిపూర్ణంగా కలిగిన నరుడెవరు? – అంటే రామచంద్రమూర్తిని చూపించాడు నారద మహర్షి సంక్షేప రామాయణంలో. అంతటి గొప్ప రాముడు కూడా గురువుకు నమస్కరించి తలవంచుకుని నిలబడ్డాడు. ఏదో యాంత్రికమైన నమస్కారం కాదు. నమస్కారం చేసేటప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా నమస్కారం చేయాలో తెలుసుకుని చేయాలి. సాష్టాంగ నమస్కారం చేయాలన్నా, అభివాదం చేయాలన్నా  ఒక పద్దతి ఉండాలి. రెండు చేతులు కలిపి తలతాకించి నమస్కారం చేయడం కూడా నమస్కారమే. అలాకాక, ప్రణిపాతం.. కర్ర ఎలా నేలమీద పడిపోతుందో అలా పడిపోవడం. అంటే ఎంత కింద పడిపోవాలో అంత పడిపోయాను. ఇంతకన్నా కిందపడే అవకాశం లేదు.

ఇప్పుడు నన్ను పైకెత్తడం మీ చేతుల్లో ఉంది... అన్న భావనతో చేస్తే ప్రణిపాతం. అంటే అహంకారం వదిలి పెద్దలముందు పడిపోవడం. రామచంద్రమూర్తి అలా గురువుగారి ముందు నిలబడి నమస్కరించి నేను రాకుమారుడిని కాదు, కింకరుడిని.. సేవకుడిని, మీరేది ఆజ్ఞాపిస్తే అలా చేయడానికి సంసిద్ధంగా ఉన్నా.. ఆజ్ఞాపించండి. అన్నాడు.. గురువుల, పెద్దల విషయంలో అలా మసలుకోవాలనేది సనాతన ధర్మం మనకు ఇచ్చిన సందేశం. గురువు గారికి తిరిగి ప్రత్యుపకారం చేస్తాను... అనడం సాధ్యమయ్యే విషయం కాదు. గురువు విషయంలో చేయగలిగినది ఏమిటి.. అంటే ...

‘జలజాతేక్షణు? దోడితెచ్చితివి నా సందేశముం జెప్పి; నన్‌/నిలువం బెట్టితి; నీ కృపన్‌ బ్రతికితిన్‌ నీ యంత పుణ్యాత్మకుల్‌/గలరే; దీనికి నీకు? బ్రత్యుపకృతిం గావింప నే నేర; నం/జలిం గావించెద; భూసురాన్వయమణీ! సద్బంధుచింతామణీ!‘ అంటుంది రుక్మిణీ దేవి భాగవతంలో. అంతటి ఉపకారం చేసిన నీకు ప్రత్యుపకారం నేనేం చేయగలను.. అంజలి ఘటించడం తప్ప... అంటుంది. అంటే రెండు చేతులు కలిపి జోడించి శిరస్సు తాటించి నమస్కరించడం. ఈ ఐదు వేళ్ళతో కూడుకున్న చెయ్యి–కర్మేంద్రియ సంఘాతం. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు పదింటిని, బుద్ధిస్ధానమయిన 11వదయిన శిరస్సును కలిపి మీ పాదాల దగ్గర న్యాసం చేస్తున్నాను... అని చెప్పడానికి నమస్కారం చేస్తారు.

ఈ తలలో వచ్చిన ఎన్నో ఆలోచనలను, ఈ చేతులతో ఎన్నో చేయకూడని పనులను చేసి మనుష్య జన్మ పాడుచేసుకున్నా. మీ వాక్కులు అగ్నిహోత్రం. నాలో ఉన్న అజ్ఞానాన్ని దహించి నేను ప్రయాణించాల్సిన మార్గాన్ని చూపించి నన్ను రక్షించండి... అని చెప్పడానికి అంజలి ఘటిస్తారు. అంతటి గొప్పరూపం గురువు. సనాతన ధర్మంలో భగవంతుడే గురువుగా కూడా ఉంటాడు. గురువు ఒకడు, భగవంతుడు ఒకడు కాదు. నిజానికి భగవంతుడే గురువు. శైవసంప్రదాయంలో దక్షిణామూర్తి చాలా చాలా గొప్ప గురువు. ఆయన నోటితో మాట్లాడకుండా చిన్ముద్రపట్టి కూర్చున్నాడు. ఆయన గురువు. అలాగే వైష్ణవ సంప్రదాయంలో శ్రీకృష్ణపరమాత్మ జగద్గురువు.‘కృష్ణం వందే జగద్గురుమ్‌!’. అమ్మవారు గురు మండల రూపిణి. సమస్త గురుమండల రూపిణి జగన్మాతయే. భగవంతుడు ఏ అవతారంలో మనముందుకొచ్చినా గురువుపట్ల అమిత గౌరవంతో ప్రవర్తిస్తాడు.

16 గుణాలు పరిపూర్ణంగా కలిగిన నరుడెవరు? – అంటే రామచంద్రమూర్తిని చూపించాడు నారద మహర్షి సంక్షేప రామాయణంల.. అంతటి గొప్ప రాముడు కూడా గురువుకు నమస్కరించి తలవంచుకుని నిలబడ్డాడు. ఏదో యాంత్రికమైన నమస్కారం కాదు. నమస్కారం చేసేటప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా నమస్కారం చేయాలో తెలుసుకుని చేయాలి. సాష్టాంగ నమస్కారం చేయాలన్నా, అభివాదం చేయాలన్నా  ఒక పద్దతి ఉండాలి. రెండు చేతులు కలిపి తలతాకించి నమస్కారం చేయడం కూడా నమస్కారమే. అలాకాక, ప్రణిపాతం.. కర్ర ఎలా నేలమీద పడిపోతుందో అలా పడిపోవడం.

అంటే ఎంత కింద పడిపోవాలో అంత పడిపోయాను. ఇంతకన్నా కిందపడే అవకాశం లేదు.  ఇప్పుడు నన్ను పైకెత్తడం మీ చేతుల్లో ఉంది... అన్న భావనతో చేస్తే ప్రణిపాతం. అంటే అహంకారం వదిలి పెద్దలముందు పడిపోవడం. రామచంద్రమూర్తి అలా గురువుగారి ముందు నిలబడి నమస్కరించి నేను రాకుమారుడిని కాదు, కింకరుడిని.. సేవకుడిని, మీరేది ఆజ్ఞాపిస్తే అలా చేయడానికి సంసిద్ధంగా ఉన్నా.. ఆజ్ఞాపించండి. అన్నాడు.. గురువుల, పెద్దల విషయంలో అలా మసలుకోవాలనేది సనాతన ధర్మం మనకు ఇచ్చిన సందేశం.

(చదవండి: అలవాటుని అధిగమించటం అతికష్టం!)

>
మరిన్ని వార్తలు