డెంటల్‌ యాబ్సెస్‌: ఆ సమయంలో నొప్పి లేదంటే తగ్గిపోయినట్లు కాదు.. నిర్లక్ష్యం చేస్తే..

2 May, 2022 12:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

డెంటల్‌ యాబ్సెస్‌ ఉన్నప్పుడు?

What Is Dental Abscess: పంటిలోపలి భాగంలో... అంటే పన్ను చిగురుతో కనెక్ట్‌ అయ్యే చోట... చిగురులోగానీ లేదా లోపల ఎముక భాగంలోగానీ... ఇన్ఫెక్షన్‌ వచ్చి అక్కడ చీము చేరడాన్ని ‘డెంటల్‌ యాబ్సెస్‌’ అంటారు. అలా వచ్చిన యాబ్సెస్‌ ఒకవేళ పంటి చివరి భాగంలో ఉంటే ఆన్ని ‘పెరియాపికల్‌ యాబ్సెస్‌’ అనీ, అదే చిగురులో ఉంటే దాన్ని ‘పెరీడాంటల్‌ యాబ్సెస్‌’ అని అంటారు.

నిజానికి మన నోళ్లలో చాలా రకాల బ్యాక్టీరియా ఉంటాయి. అలాంటప్పుడు నోట్లో పన్ను దెబ్బతిన్నా... అక్కడ బ్యాక్టీరియా పెరుగుతుంది. తర్వాత అదే అంశం ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు. పంటి చిగురుకు ఇన్ఫెక్షన్‌ కారణంగా దాన్నిండా చీము చేరడం వల్ల ‘పంటి ఆబ్సెస్‌’ వచ్చినప్పుడు తొలుత ఆ భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇన్ఫెక్షన్‌ చిగురుకూ పాకుతుంది.

పంటిని వదులు చేయవచ్చు. యాబ్సెస్‌ ఓ చిన్నగడ్డలా ఉండి, ఒక్కోసారి అది చిదిమినట్లుగా కూడా అవుతుంది. ఇది జరిగినప్పుడు నొప్పి అకస్మాత్తుగా చేత్తో తీసేసినట్లు అవుతుంది. అలాంటప్పుడు నొప్పి లేదంటే అదేదో తగ్గిపోయిందని కాదు. అలా నిర్లక్ష్యం చేస్తే పంటి ఆబ్సెస్‌లోని చీము క్రమంగా దవడకూ, తలకూ పాకవచ్చు. అది చాలా రకాల కాంప్లికేషన్లకు దారి తీయవచ్చు. 

పంటి ఆబ్సెస్‌ ఉన్నచోట తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది. వేడి లేదా చల్లటి పదార్థాలు తిన్నప్పుడల్లా జిల్లుమంటుంది. అదేకాదు... నమలగానే జిల్లుమన్నట్లుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో డెంటిస్ట్‌కు చూపించకపోతే ఆ ఇన్ఫెక్షన్‌ దేహంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించవచ్చు. ఆ సమస్యను నివారించడంతోపాటు మున్ముందు వచ్చే ఇతర దుష్ప్రభావాలను ముందే అరికట్టడం కోసం నోటిలో/పళ్లలో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే డెంటిస్ట్‌కు చూపించుకోవాలి.  

చదవండి👉🏾Cracked Heels Remedy: కాళ్ల పగుళ్లు వేధిస్తున్నాయా.. గోరువెచ్చటి నీటిలో కాస్తంత ఉప్పు వేసి.

మరిన్ని వార్తలు