Catch-22 Meaning: క్యాచ్‌–22 సిచ్యువేషన్‌ అంటే ఏంటో తెలుసా?

29 Jan, 2022 18:20 IST|Sakshi

ఇంగ్లీష్‌ ఇడియమ్స్‌ 

జీవితంలో మనకు అప్పుడప్పుడూ కొన్ని రకాల సందర్భాలు ఎదురవుతుంటాయి. కింద ఇచ్చిన పరిస్థితి మీకు ఎప్పుడైనా ఎదురైతే ‘క్యాచ్‌–22 సిచ్యువేషన్‌’లో ఉన్నట్లు.
► ఏదైనా ఒక సందర్భంలో ఒక అడుగు ముందుకు వేయబోతే సమస్యల్లో చిక్కుకునే పరిస్థితి ఎదురుకావడం. (క్లిక్‌: ఉత్త ప్యాంగసియన్‌ ఆశ.. ఇంతకీ ఎవరు ఇతను?)
 
► మీరు మీ కళ్లజోడును ఎక్కడో పెట్టి మరిచిపోతారు. అయితే అవి ఎక్కడున్నాయో వెదకాలంటే కళ్లజోడు తప్పనిసరి. ఇదొక విచిత్ర పరిస్థితి. ∙మీరు కారు డ్రైవ్‌ చేస్తూ ఒక సైకిలిస్ట్‌ను ఢీకొట్టారు. ‘నువ్వు సైకిలిస్ట్‌ను చూశావా?’ అని జడ్జి అడుగుతాడు. ‘చూశాను’ అని అంటే ‘చూస్తూ కూడా ఎందుకు ఢీకొట్టావు?’ అని అడుగుతాడు. ‘చూడలేదు’ అని చెబితే ‘అంత నిర్లక్ష్యమా!’ అంటాడు. ఇదొక సంకట పరిస్థితి. (నయా ఇంగ్లిష్‌: ఘోస్ట్‌ కిచెన్‌ అంటే?)

జోసెఫ్‌ హెలీ రాసిన క్యాచ్‌–22 సెటైరికల్‌ నవలతో ఈ ‘క్యాచ్‌–22’ అనే ఎక్స్‌ప్రెషన్‌ మొదలైంది. రెండో ప్రపంచయుద్ధ నేపథ్యం తీసుకొని రాసిన ఈ నవలలో యుద్ధంలో ఉండే క్రూరత్వం, వినాశనాన్ని వ్యంగ్యాత్మకంగా  చెబుతారు రచయిత. (క్లిక్‌: అక్కడి పరిస్థితి హెలైసియస్‌గా ఉంది..!)

మరిన్ని వార్తలు