Facial Paralysis: ఒకవైపు కనురెప్ప మూసుకుపోతోందా? అయితే...

17 Feb, 2022 15:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

‘బెల్స్‌ పాల్సీ’నా... బెంగ వద్దు! 

కొందరిలో ముఖంలోని ఒకవైపు కండరాలపై మెదడు నియంత్రణ తగ్గిపోతుంది దాంతో ఒకవైపు కనురెప్ప వాలిపోవడం, ఒకవైపు భాగమంతా అకస్మాత్తుగా జారిపోయినట్లుగా అయిపోతుంది. దీన్నే వాడుక భాషలో ‘ఫేషియల్‌ పెరాలసిస్‌’, వైద్య పరిభాషలో ‘బెల్స్‌పాల్సీ’ అంటారు. ఇది చాలా సాధారణంగా కనిపించే సమస్య. చాలావరకు నిరపాయకరమైనది.

మెదడు కింద ఉన్న వెన్నుపాము నుంచి 12 నరాలు బయటకు వస్తాయి. అలా పుర్రె భాగం నుంచి బయటకు వచ్చిన నాడులను ‘క్రేనియల్‌ నర్వ్స్‌’ అంటారు. ఇందులో ముఖం కండరాలను నియంత్రించే  ‘ఏడవ నరం’ దెబ్బతినడం వల్ల ముఖంలోని ఒకవైపు భాగమంతా చచ్చుబడినట్లు అయిపోతుంది. ముఖం వంకరగా కనపడుతుంది. నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఈ వంకరదనం ఎక్కువగా కనిపిస్తుంది. 

లక్షణాలు
హెర్పిస్‌ సింప్లెక్స్‌ లాంటి ఏదైనా వైరల్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చాక, దాని వల్ల ఉత్పన్నమైన యాంటీబాడీస్‌ ఫేషియల్‌ను దెబ్బతీసాయి. ఫలితంగా నరానికి వాపు వస్తుంది. దాంతో అది నియంత్రించే భాగాలు చచ్చుబడిపోతాయి. ఫలితంగా మూతి, ముఖం వంకరపోవడం, ఆ వైపు కంట్లోంచి నీరు కారడం, నీళ్లు పుక్కిలిస్తున్నప్పుడు ఒకవైపు నుంచి ఆపని సరిగా చేయలేకపోవడం, ఒకవైపు కనురెప్ప మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

చికిత్సలో భాగంగా అవసరాన్ని బట్టి డాక్టర్‌ల సూచన మేరకు యాంటీ వైరల్‌ మందులు, స్టెరాయిడ్స్‌ వాడతారు. మెరుగుదల అన్నది జబ్బు తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. తొంభైశాతం పైగా బాధితులు ఆరునెలల్లో పూర్తిగా కోలుకుంటారు.  

చదవండి: Bappi Lahiri Death: బప్పీలహరి మృతికి కారణం ఇదే.. సాధారణంలా అనిపించినా ఎంతో ప్రాణాంతకం కూడా!

మరిన్ని వార్తలు