అసలు ఐఐటీలో ఏముంటుంది? ఎందుకు చేర్పించాలి? ఏం నేర్చుకుంటారు?

28 Apr, 2023 15:37 IST|Sakshi

ఐఐటీలో ఇటీవల జరుగుతున్న ఘటనలు, వివిధ వార్తల నేపథ్యంలో ఒక ఐఐటీ విద్యార్థి పేరుతో Sripati Nagaraju ఫేస్‌ బుక్‌లో రాసిన అభిప్రాయాన్ని పాఠకులతో షేర్‌ చేసుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది తల్లితండ్రులు తమ పిల్లలను ఐఐటీల్లో చేర్పించాలన్న తపన పడుతుంటారు. ఇటీవల ఐఐటీల్లో వరుసగా విద్యార్థులు ఆత్మహత్యల ఘటనలకు సంబంధించిన వార్తలతో కొందరు అసలు ఏం జరుగుతుందని తెలుసుకుంటున్నారు. అలాంటి వారందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది.

ఒక ఐఐటీ విద్యార్థి అభిప్రాయం IIT లు సృజనాత్మకతకు కేంద్రాలు. ఒక క్రియేటర్ గా ఉండాలనుకున్నవాడికి , ఐఐటీలో వాడి కులమే గుర్తుండదు.. పక్కవాడి కులంతో పనేలేదు. ఒత్తిడి అనేది IITలలో కో కరిక్యులర్‌, ఎక్సట్రా కరిక్యులర్‌ యాక్టివిటిస్‌లో, క్లబ్స్‌లో పాల్గొనకుండా నా రూమ్ లో నేను తెగ చదివేసుకుంటాను అనేవాడికి ఉంటుంది.

అసలు అలాంటివాళ్ళు IIT లకు పనికి రారు అని అడ్మిషన్ అయిన మొదటిరోజు జరిగే ఓరియంటేషన్ క్లాస్ లోనే ప్రొఫెసర్లు చెప్తారు. Drop outs : వరసగా ఏవైనా రెండు సెమిస్టర్లలో 5 GPA కంటే తక్కువ వస్తే ఆటోమేటిక్ గా రోల్స్‌ నుండి ఔట్‌ అవుతారు. Hindi, English లలో నైపుణ్యం పెంచుకోకుండా , సెల్ఫ్‌ స్టడీ అలవాటు చేస్కోకుండా, క్రియేటివ్‌ స్కిల్స్‌ డెవలప్‌ చేసుకోకుండా ఉండే స్టూడెంట్‌ డ్రాప్‌ అవడానికి అవకాశం ఎక్కువ.

Games ఆడకపోవటం వలన ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ తగ్గొచ్చేమోగానీ, గెలుపు ఓటములను సమానంగా తీసుకునే తత్వం IITiansకి ఉంటుంది కు ప్రిపేర్‌ అయ్యే క్రమంలో రాసే వందల ప్రాక్టీస్‌ టెస్టులు ప్రతీదీ ఒక ఆటే. అందులో తగ్గడం, పడిలేచిన కెరటంలా ఎదగటం మేం నేర్చుకుంటున్నాం. నేర్చుకున్నాం.

ఇక IITలలో చేరినాక జిమ్‌లో మన ఫిట్‌నెస్‌ పెంచుకోవచ్చు. నచ్చిన స్పోర్ట్స్‌ ఎంచుకొని ఆడుకోవచ్చు. ప్రిపరేషన్‌లో భాగంగా హాస్టల్స్ లో ఉండే విద్యార్థులకు హ్యపీ ఎంజైమ్స్‌ రిలీజ్ అవకపోవటం అంటూ ఉండదు. మా ఫన్‌ మాకు ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులను మిస్ అయినా , చాలా మంది స్నేహితుల ద్వారా ఆ లోటు పూరించుకుంటూ పరీక్షకు చదువుకుంటాం.

కాబట్టి ఆ లోటు మాకు లేదు. యూనివర్శిటీలలో కుల వివక్ష ఉండొచ్చేమోగానీ, అత్యుత్తమ IIT లలో కులం తో సాధించేదేమీ లేదు, స్కాలర్ షిప్ తప్ప. అసలు అడ్మిషన్‌ కోసమే IIT Rank అవసరం. కానీ ఒకసారి అడ్మిట్‌ అయ్యాక మనకొచ్చిన ర్యాంకు నాలుక గీస్కోటానికి కూడా పనికిరాదు.

అసలు IIT లలో నీ ర్యాంకు ఎంత అని అడిగేవాడే ఉండడు. ఈ ర్యాంకు వల్ల విద్యార్థుల్లో ఆత్మన్యూనతకి అవకాశమేలేదు. IIT లో Ph.D లాంటి మహోత్కృష్ఠమైన కోర్స్ లో చేరినవాడు కూడా ఆత్మహత్య చేస్కున్నాడూ అంటే వాడు ఐడియాలజికల్‌గా ఎంతో వెనకబడి ఉన్నాడని అర్థం.

దానికీ అసలు ఒత్తిడి అనేమాటే ఉండదు. ప్రేమ వ్యవహారాలు, కుటుంబ కలహాలు, తల్లిదండ్రుల ప్రవర్తన, ఇలా ఎన్నో పార్శ్వాలు ఆత్మహత్యల వెనక ఉంటాయి. IITల శిక్షణ పేరిట వేల కోట్ల వ్యాపారం జరగొచ్చు గాక‌. అది IITల బయట విషయం. దానికీ IITలకి సంబంధం లేదు. కార్పొరేట్ కాలేజీలు రాకముందు కూడా 1954 నుండే IIT లు ఉన్నాయి. కార్పొరేట్ వ్యాపార దాహానికి ప్రతిష్టాత్మక IIT లకు సంబంధం లేదు.

కార్పోరేట్‌ కాలేజీల్లో చేర్పిస్తేనే మా IIT లో అడ్మిషన్‌ ఇస్తాం అని ఏ ఒక్క IIT కూడా చెప్పదు. విద్యార్థి ఇష్టాయిష్టాలు, శక్తి సామర్థ్యాల ప్రకారం తల్లితండ్రులు తమ పిల్లల భవిష్యత్తును ప్లాన్‌ చేయాలి. అంతే తప్ప దానికి భిన్నంగా ప్రవర్తించవచ్చు. దురాశ దుఃఖానికి చేటు అనేది ఉండనే ఉంది. అది ఏ రంగం కైనా వర్తిస్తుంది. IIT కి ఒక్కదానికే కాదు.

మరిన్ని వార్తలు