నెల రోజులు పాలు, పెరుగు మానేస్తే ఏమవుతుందో తెలుసా?

14 Feb, 2024 12:06 IST|Sakshi

రోజువారీ జీవితంలో పాలు పెరుగు లేకుండా పొద్దు గడవదు. చాయ్‌ రూపంలో లేదా పెరుగు రూపంలోనో పాలను తీసుకోకుండా ఉండలేం. అందులోనూ ఆఫీస్‌కి వెళ్లేవాళ్లకు ఓ కప్పు కాఫీ లేదా టీ తాగకుండా ఉండలేరు. అలాగే పెరుగన్నం తినకుండా భోజనం పూర్తి అయ్యిన ఫీల్‌ రాదు చాలామందికి. అయితే డాక్టర్లు మాత్రం ఈ పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటే బరువు సులభంగా తగ్గుతారు అంటూ షాకింగ్‌ విషయాలు చెబుతున్నారు. అంతేగాదు ఈ పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటే మన ఆరోగ్యంలో గొప్ప మెరుగైన మార్పులు సంభవిస్తాయని అన్నారు. అదేంటి పౌష్టికాహారం అయిన పాలే మానేయాలా? ఏంటిదీ..?

ఒక నెల రోజుల పాటు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండేందుకు సిద్ధపడితే మంచి మెరుగైన ఫలితాలు అందుకోగలరని వైద్యులు నమ్మకంగా చెబుతున్నారు. ఈ డైరీ ఫ్రీ ప్రయోగం మంచి సత్ఫతితాలనిస్తుందని ధీమాగా చెబుతున్నారు. ఈ మేరకు యశోధ హాస్పిటల్స్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజిషియన్‌ డాక్టర్‌ దిలీప్‌ గుడే డైరీ ప్రొడక్ట్స్‌కి దూరంగా ఉంటే ఆహారం నుంచి అదనపు సంతృప్త కొవ్వులు, చక్కెర, ఉప్పు ఆటోమెటిక్‌గా తగ్గిపోతాయని అన్నారు. ఈ డైట్‌  శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి మెరుగ్గా ఉంచుతుందని చెబుతున్నారు. జస్ట్‌ మూడు వారాల్లోనే దీని ప్రయోజనాలు మన శరీరంలో కనిపించడం మొదలవుతుందని తెలిపారు. అంతేగాదు గుండె జబ్బులు, అల్జీమర్స్‌, మధుమేహం వంటి రుగ్మతలు దరిచేరవని చెబుతున్నారు.

అలాగే ఈ డైరీ ఉత్పత్తులు మన ఆహారంలో తగ్గిచడం ప్రారంభిస్తామో అప్పుడూ వెంటనే మన బరువు నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ డైట్‌ ప్రభావం వ్యక్తులు మధ్య వేర్వేరుగా ఉంటుందని చెప్పారు. ఈ డైట్‌ ఫాలో అయ్యేటప్పుడూ పోషకలోపాలను భర్తీ చేసేలా సమతుల్య ఆహారం శరీరానికి అందేలా చూసుకోవడం ముఖ్యం. అదే సమయంలో డైరీ ఉత్పత్తులను తగ్గిస్తే గట్‌ బ్యాక్టీరియా యాక్టివిటీలో మార్పులు వస్తాయాని, అవి ప్రతికూలం లేదా సానుకూలమైన కావొచ్చు. ఇది వ్యక్తలు ఆరోగ్య స్థితిని బట్టి ఆయా ఫలితాలు రావడం జరగుతుందని చెబుతున్నారు వైద్యులు. పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటం వల్ల చర్మం ఆరోగ్యం మెరుగపడి, వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది.

ముఖ్యంగా మెటిమల సమస్య నివారణవవుతుంది. అయితే చర్మం మెరుగుదలకు అవసరమైన పాల ఉత్పత్తులకు సంబంధించిన కొన్ని హర్మోన్లలో హెచ్చు తగ్గులు ఏర్పడవచ్చు. అలాగే పాల ఉత్పత్తుల్లో ఎముకల ఆరోగ్యానికి మూలమైన కాల్షియం కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది. అలాంటప్పుడూ ఆ భర్తీని కాల్షియం, విటమిన్‌ డీ వంటి ప్రోటీన్‌ పోషకాలు అందించే బాదం, టోఫు, బ్రోకలీ, అత్తి పండ్లను, పొద్దుతిరుగుడు విత్తనాలతో పొందొచ్చు. ఇక్కడ పాల ఉత్పత్తులకు దూరంగా ఉండే డైట్‌ అనుసరించాలనుకుంటే ఆ పాలల్లో ఉండే కాల్షియంని పొందేలా ప్రత్యామ్నాయా ఆహార పదార్థాలను తీసుకోవడం ముఖ్యం.

పాల వినియోగంతో ముడిపడే ఉండే రొమ్ము, అండాశయ, ప్రొస్టేట్‌ క్యాన్సర్లు వటి వ్యాధులు దరిచేరవని తెలిపారు. అలాగే జీవక్రియ, నిద్ర, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని చెబుతున్నారు. అంతేగాక కొందరూ వ్యక్తులు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నవారు కూడా ఉన్నారన్నారు. ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగపడి పలు విధాల అనారోగ్య సమస్యల నుంచి ఈజీగా బయటపడతామని పేర్కొన్నారు. ఈ పాల ఉత్పత్తులను తగ్గించిన వెంటనే కొందరిలో శ్లేష్మం తగ్గి శ్వాసకోస సమస్యలు తగ్గుముఖం పడుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ ఫలితాలు వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుందని, అందువల్ల ఈ డైట్‌ఫాలో అయ్యేటప్పుడూ డ్రైరీ ప్రోటీన్లకూ దూరంగా ఉండటం వల్ల వచ్చే అసహనాన్ని ఓపిగ్గా ఎదుర్కొంటూ ఫాలో అయితే మంచి ఫలితాలను పొందుతారని వైద్యుల సూచిస్తున్నారు. 

(చదవండి:

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega